
What Does It Mean for Juhi Chawla and Aryan Khan?: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో బాలీవుడ్ నటి జూహీ చావ్లా కీలక పాత్ర పోషించారు. ఆర్యన్‌కు బెయిల్ రావడానికి ఆమె పూచీకత్తు ఇచ్చారు. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆర్యన్ బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్ పేపర్లపై సంతకం చేశారు. బాండ్‌పై సంతకం చేసిన అనంతరం బయటకు వచ్చిన జూహీ చావ్లా మీడియాతో మాట్లాడారు.
చదవండి: బెయిల్ వచ్చినా జైలులోనే ఆర్యన్ ఖాన్..
ఈ మేరకు ఆమె మీడియాతో ‘ఇప్పడు ఆర్యన్ బయటకు రావడం ముఖ్యం. అదే పదివేలు’ అని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఆర్యన్ డబ్బు చెల్లించడంలో విఫలమైనా, అతడు కోర్టు ఆదేశాలను ధిక్కరించినా దీనికి జూహీ చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాగా షారుక్ ఖాన్, జూహ్లీ చావ్లా కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కలయికలో బి-టౌన్‌కు పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. అంతేగాక వీరిద్దరూ ఇప్పుడు ఐపీఎల్ టీం కోల్‌కత్తా నైట్ రైడర్స్(కేకేఆర్) టీం ఫ్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ
ఈ కేసులో గురువారం ఆర్యన్ బెయిల్ పటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పత్రాలు ఆర్యన్ ఉన్న ఆర్థర్ రోడ్ జైలుకు పంపించాలంటే షూరిటీ సంతకాలు కీలకం. ఎందుకంటే ఆర్యన్ తరపున చట్టపరమైన బాధ్యత తీసుకుంటూ ప్రముఖులైన బయటి వ్యక్తులు ఇద్దరూ పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆర్యన్ విడుదల అవ్వడం కోసం జూహీ చావ్లా నిజంగా పెద్ద ధైర్యం చేశారని చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment