డూప్ లేకుండా ఫైట్లు | Fights without dup | Sakshi
Sakshi News home page

డూప్ లేకుండా ఫైట్లు

Published Thu, May 22 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

డూప్ లేకుండా ఫైట్లు

డూప్ లేకుండా ఫైట్లు

కేన్స్ చలన చిత్రోత్సవాల్లో వీక్షకులు చూపులు తిప్పుకోలేని స్థాయిలో తళుకులీనుతున్నారు ఐశ్వర్యా రాయ్. ఓ ఆరేడు నెలల క్రితం కూడా బొద్దుగా కనిపించిన ఐష్ ఇలా సన్నబడటం అందరినీ స్వీట్ షాక్‌కి గురి చేసింది. బిడ్డకు జన్మనిచ్చి మూడు నాలుగేళ్లయినా ఇంకా బరువు తగ్గలేదని ఎవరైతే విమర్శించారో వాళ్లందరి నోళ్లూ మూతబడిపోయేలా ఐష్ స్లిమ్ అయ్యారు. ‘పాత ఐష్‌ని చూసినట్లుగా ఉంది’ అని అభిమానులు మురిసిపోతున్నారు. అలాగే, ఐష్ చేయబోతున్న సినిమా గురించి అధికారిక ప్రకటన రావడం వాళ్లని మరింత ఆనందంలో ముంచెత్తింది. ఈ అందాల సుందరి తెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లయ్యింది.
 
మణిరత్నం దర్శకత్వం వహించినున్న చిత్రం ద్వారా మళ్లీ తెరపై కనిపించనున్నారని, ప్రహ్లాద్ కక్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారని వార్తలు వచ్చాయి. అధికారికంగా ఈ చిత్రాలను ప్రకటించకపోవడంతో, వీటిలో ఐష్ నటిస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సంజయ్ గుప్తా ట్విట్టర్ ద్వారా ఐష్ తన సినిమాలో నటించనున్నట్లు పేర్కొన్నారు. ‘జాజ్‌బా’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ఐష్ ఓ శక్తిమంతమైన పాత్ర చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ఐష్ వీరోచిత పోరాటాలు కూడా చేస్తారట. వాటిని డూప్ లేకుండా స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నారు ఈ సుకుమారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement