భయపెట్టేందుకు వస్తోన్న మరో మిస్టరీ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్! | Another Tollywood Suspense Thriller Inti No.13 Movie Released On This Date, Deets Inside - Sakshi
Sakshi News home page

Thriller Movie Inti No.13 Release Date: భయపెట్టేందుకు వస్తోన్న మరో మిస్టరీ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published Mon, Feb 19 2024 7:36 PM | Last Updated on Mon, Feb 19 2024 8:16 PM

Another Tollywood Suspense thriller Movie Released On This Date - Sakshi

సినీ ఇండస్ట్రీలో ఇటీవల హారర్ చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి. గతంలో కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి హారర్‌ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడు పన్నారాయల్ మరోసారి భయపెట్టేందుకు వస్తున్నారు.  నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన తాజా చిత్రం 'ఇంటి నెం.13'.  రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై  హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా  రిలీజ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్‌ చూడగానే విభిన్నమైన మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. 

ఈ సందర్భంగా పన్నారాయల్‌ మాట్లాడుతూ..'ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్‌ ఎన్నో హారర్‌ సినిమాలు చూశారు. కానీ పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది. ఇందులోని మిస్టరీ, సస్పెన్స్‌ ఆడియన్స్‌ని కట్టి పడేస్తాయి. సినిమాలో ప్రతి పది నిమిషాలకు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు. ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది. మేం అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిస్తుంది' అని అన్నారు. 

నిర్మాత హేసన్‌ పాషా మాట్లాడుతూ.. ' ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్‌ చూడని ఒక కొత్త తరహా చిత్రమిది. పన్నా గత చిత్రాలను మించేస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 1న ఈ డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్‌ చేస్తారు'  అని అన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు వినోద్‌ యాజమాన్య సంగీతమందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement