థ్రిల్ చేస్తా!
‘‘నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే నా మొదటి సినిమాకు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నా’’ అని చెప్పారు ‘కాలింగ్ బెల్’ దర్శకుడు పన్నా రాయల్. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితీ ఖన్నా ముఖ్య తారలుగా గోల్డెన్ టైమ్ పిక్చర్స్ పతాకంపై అనూద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ -‘‘వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నేను ఓ పెద్ద సినిమా తీద్దామని వచ్చా. కానీ ముందు ఓ చిన్న సినిమా తీయమని స్నేహితులు సలహా ఇచ్చారు. అందుకే ‘కాలింగ్ బెల్’ సినిమా తీశా. చిన్న సినిమా అయినా బాగా ఆదరిస్తున్నారు. ఇక నుంచి అడ్వెంచరస్, సస్పెన్స్ నేపథ్యంలో సినిమాలు తీసి ప్రేక్షకులను థ్రిల్ చేస్తా’’ అన్నారు.