డీఐజీగా రవివర్మ బాధ్యతల స్వీకరణ
Published Fri, Sep 9 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
వరంగల్ : వరంగల్ రేంజ్ డిఐజీగా, కరీంనగర్ రేంజ్ ఇన్‌చార్జి డీఐజీగా సి.రవివర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సభర్వాల్ నుంచి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రవి వర్మ మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ రేంజ్ పరిధిలో నేరాల అదుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. శాంతిభద్రతల విషయం లో రాజీపడే ప్రసక్తి లేదని, రెండు రేంజ్‌ల పరిధిలోని పోలీసులు ఒకే టీంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు.
జిల్లాకు సుపరిచితులే...
డీఐజీ రవివర్మ జిల్లాకు సుపరిచుతులే. ములు గు డీఎస్‌పీగా 1990–92 మధ్య కాలంలో పనిచేశారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా, ఎల్‌బీనగర్ డీసీపీగా, హైదరాబాద్ క్రైం, వెస్ట్‌జోన్ డీసీపీగా, సీఐడీ డీఐజీగా పనిచేశారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన రవివర్మకు వరంగల్ రూరల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఎస్పీలు అంబర్ కిషోర్‌ఝూ, షానవాజ్ ఖాసీం, విక్రమ్‌జిత్ దుగ్గల్, జోయల్ డేవిడ్‌లు అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement