taken charge
-
బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ
-
తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ చేస్తా..
-
తెలంగాణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
ద్వారకా తిరుమలరావు: ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా
విజయవాడ: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఎండీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎండీకి అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రజలకు ఆర్టీసీ ద్వారా మరింత మెరుగైన రవాణా సేవలు అందిస్తానని తెలిపారు. కోవిడ్ తో విపత్కర పరిస్థితిల్లోనూ ఆర్టీసీ సిబ్బంది సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ద్వారకా తిరుమలరావు అభినందించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్వారకా తిరుమలరావు ఇలా మాట్లాడారు. ‘‘ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నన్ను నియమించినందుకు చాలా సంతోషపడుతున్నా. ప్రభుత్వం నాపై గురుతర బాధ్యతలు అప్పగించింది. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తా. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేస్తా. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు నా వంతు ప్రయత్నాలు చేస్తా. దీనికోసం తగిన ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తా. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రయత్నిస్తా’ అని ద్వారకా తిరుమలరావు తెలిపారు. -
డీఐజీగా రవివర్మ బాధ్యతల స్వీకరణ
వరంగల్ : వరంగల్ రేంజ్ డిఐజీగా, కరీంనగర్ రేంజ్ ఇన్చార్జి డీఐజీగా సి.రవివర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సభర్వాల్ నుంచి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రవి వర్మ మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ రేంజ్ పరిధిలో నేరాల అదుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. శాంతిభద్రతల విషయం లో రాజీపడే ప్రసక్తి లేదని, రెండు రేంజ్‌ల పరిధిలోని పోలీసులు ఒకే టీంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. జిల్లాకు సుపరిచితులే... డీఐజీ రవివర్మ జిల్లాకు సుపరిచుతులే. ములు గు డీఎస్పీగా 1990–92 మధ్య కాలంలో పనిచేశారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా, ఎల్బీనగర్ డీసీపీగా, హైదరాబాద్ క్రైం, వెస్ట్‌జోన్ డీసీపీగా, సీఐడీ డీఐజీగా పనిచేశారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన రవివర్మకు వరంగల్ రూరల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఎస్పీలు అంబర్ కిషోర్‌ఝూ, షానవాజ్ ఖాసీం, విక్రమ్‌జిత్ దుగ్గల్, జోయల్ డేవిడ్‌లు అభినందనలు తెలిపారు.