భయపడే దెయ్యం | idhem Dhayyam releasing on august 4th | Sakshi
Sakshi News home page

భయపడే దెయ్యం

Published Tue, Aug 1 2017 3:31 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

భయపడే దెయ్యం

భయపడే దెయ్యం

ఏ.వి ర‌మ‌ణ‌మూర్తి స‌మ‌ర్పణ‌లో చిన్మయానంద ఫిల్మ్స్ ప‌తాకంపై ఎస్. స‌రిత నిర్మిస్తోన్న చిత్రం ఇదేం దెయ్యం. శ్రీనాధ్ మాగంటి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సాక్షి క‌క్కర్, ర‌చ‌న స్మిత్, రుచి పాండే నాయిక‌లు. ర‌చ్చ ర‌వి, కిరాక్ ఆర్.పి కీల‌క పాత్రధారులు. వి. ర‌వివ‌ర్మ ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా,  బాలు స్వామి సంగీతం అందించారు. అన్ని  ప‌నులు పూర్తిచేసుకుని ఈనెల 4న సినిమా  రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో చిత్ర యూనిట్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది.

ఈ సంద‌ర్భంగా  చిత్ర హీరో మాగంటి శ్రీనాద్ మాట్లాడుతూ, 'హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెర‌కెక్కించిన సినిమా ఇది. భ‌య‌ప‌డే స‌న్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సినిమా కోసం చాలా క‌ష్టప‌డ్డాం. కానీ ఆ క‌ష్టాలు థియేట‌ర్ కు వ‌చ్చిన ఆడియ‌న్స్ ను న‌వ్విస్తాయి. ముఖ్యంగా  ర‌చ్చ ర‌వి, ఆర్ పి తో నా కాంబినేష‌న్ సీన్స్ బాగుంటాయి. ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం'  అన్నారు.

చిత్ర ద‌ర్శకుడు ర‌వి వ‌ర్మ మాట్లాడుతూ, ` ర‌చ్చర‌వి, ఆర్.పి, శ్రీనాధ్ ను దృష్టిల్లో పెట్టుకుని క‌థ రాసుకున్నా. నేను అనుకున్న దానిక‌న్నా బాగా న‌టించారు. శ్రీనాధ్ కొత్త కుర్రాడైనా చాలా బాగా న‌టించాడు. కామెడీ హైలైట్ గా ఉంటుంది. హార‌ర్ స‌న్నివేశాలు ప్రేక్షకుల‌ను థ్రిల్ కు గురిచేస్తాయి. సినిమా చూసిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు మంచి డిస్ర్టిబ్యూట‌ర్స్ దొరికారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల‌లో మొత్తం 100 థియేట‌ర్ల‌ల‌లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులంతా త‌ప్పకుండా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్న'మని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement