వరంగల్ డీఐజీగా రవివర్మ
-
ప్రభాకర్‌రావు ఇంటిలిజెన్స్‌కు
సాక్షి, హన్మకొండ : వరంగల్ రేంజ్ డీఐజీగా సి.రవివర్మ నియమితులయ్యారు. ఇక్కడ డీఐజీగా ఉన్న డాక్టర్ టి.ప్రభాకర్‌రావు ఇంటిలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం రవివర్మ సీఐడీలో డీఐజీగా పనిచేస్తున్నారు. ఆయన అక్కడి నుంచి వరంగల్‌కు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్–2 పేపర్ లీకేజీ కేసును రవివర్మ దర్యాప్తు చేపట్టారు. కాగా, వరంగల్ జిల్లా వాసి అయిన ప్రభాకర్‌రావు ఈ సంవత్సరం మే 21న వరంగల్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. మూడు నెలలకే ఆయన బదిలీ అయ్యారు. సీనియర్ పోలీసు అధికారులైన రవివర్మ, ప్రభాకర్‌రావు ఇద్దరూ 2001 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు కావడం విశేషం.