రాష్ట్ర విభజన వద్దు
Published Mon, Sep 23 2013 3:13 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
భోగాపురం, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన నిర్ణయూన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం భోగాపురం, డెంకాడ మండలాల పాత్రికేయులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజీఎఫ్ జిల్లా కమిటీ సభ్యుడు జంపన రవివర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. వీరికి ఎన్‌జీఓ సంఘ నాయకులు కొమ్మూరు దుర్గారావు, సంఘ ఉద్యోగులు సీహెచ్‌ఆర్‌కె రాజు, డీసీసీబీ అధ్యక్షుడు సుందర గోవిందరావు, ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు, హెచ్‌డీటీ భాస్కరరావు, ఆర్‌ఐ పిట్ట అప్పారావు తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం పాత్రికేయులంతా ర్యాలీ నిర్వహించి స్థానిక ఎస్‌బీఐ కూడలి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట సేపు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు ఎం.రామారావు, పల్లి శ్రీను, పైల శ్రీను, ఏలూరు రమణ, ఎం.కుసరాజు, రవితేజ, సవరవిల్లి శంకరరావు, పోతిరెండి గోపి, ఏకాంబరం, రమేష్, అట్టాడ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement