=తిరుమల నుంచి తిరుగు పయనమైన భక్తబృందం
=మార్గమధ్యంలో ప్రమాదం ఇద్దరి మృతి
=ఒకరి పరిస్థితి విషమం
పాకాల, న్యూస్‌లైన్: వారంతా ఒకే గ్రామస్తులు. తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కారులో తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పాకాల మండలంలోని గుంతగాదంకి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని తిరుపత్తూరు గ్రామస్తులు ఆరుగురు గురువారం తిరుమలకు వెళ్లారు. స్వామి దర్శనం అనంతరం కారు లో తిరుగు ప్రయాణమయ్యారు. గుంతగాదంకి సమీపంలోని తిరుపతి- చిత్తూరు హైవే రోడ్డు గంగోత్రి ఆశ్రమం వద్ద శుక్రవారం తెల్లవారుజామున కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులోని గాయపడ్డారు.
బాధితులను తిరుపతికి తరలిస్తుండగా సరసు (ఏడాదిన్న వయసు బాలుడు) మార్గమధ్యంలో చనిపోయాడు. అలాగే వరదప్ప(40) తిరుపతి రుయా ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. శరవణ(33), అతని భార్య సోనియా(22), రవివర్మ(4), పాండురంగం(40) గాయపడ్డారు. వీరిలో పాండురంగం పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పాకాల హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు.
గమ్యం చేరని పయనం
Published Sat, Dec 7 2013 4:00 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
Advertisement