ఫుల్‌ ఫోకస్‌ | Ravi Varma welcomes Vivek Oberoi to Sandalwood | Sakshi
Sakshi News home page

ఫుల్‌ ఫోకస్‌

Published Mon, Jul 16 2018 1:29 AM | Last Updated on Mon, Jul 16 2018 1:29 AM

Ravi Varma welcomes Vivek Oberoi to Sandalwood - Sakshi

శివరాజ్‌ కుమార్, వివేక్‌ ఒబెరాయ్‌

గతేడాది అజిత్‌ హీరోగా నటించిన ‘వివేగమ్‌’ సినిమా ద్వారా విలన్‌గా కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌. ఈ ఏడాది కన్నడ చిత్రం ‘రుస్తుం’ సినిమాతో శాండిల్‌వుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారాయన. ఇందులో శివరాజ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ రవివర్మ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ‘‘రుస్తుం’ సినిమాతో వివేక్‌ ఒబెరాయ్‌ శాండిల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని చెప్పడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు రవివర్మ.

అలాగే.. మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తోన్న ‘లూసీఫర్‌’ చిత్రంతో వివేక్‌ ఒబెరాయ్‌ మాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ‘రక్తచరిత్ర’ సినిమాతో ఆయన ఎప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేశారు. ప్రస్తుతం తెలుగులో బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తోన్న సినిమాలో వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఇవన్నీ చూస్తుంటే.. వివేక్‌ సౌత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టినట్లు ఉంది కదూ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement