
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని టీ–హోప్ కార్యాలయంలో ఆదివారం అజహరుద్దీన్ ఆ సంస్థ చైర్మన్ ఉపేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ... స్థానికంగా ఉపేందర్‌రెడ్డి ఇప్పటికే ఎన్నోమార్లు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారని, ప్రజాభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. అలాంటి నాయకుడు తమకు సహకారం అందించాలని కోరారు.
ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపితే ఇక్కడ కాంగ్రెస్ విజయం తధ్యమవుతుందని అజహరుద్దీన్ స్పష్టం చేశారు. ఉపేందర్‌రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందించదగ్గవని ఆయన పేర్కొన్నారు. ఇక్కడకు వచి్చన మహిళల ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఇక కాంగ్రెస్ తిరుగులేదని అనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలందరికీ మంచి జరగాలని తపన పడుతున్న ఆయనకు భవిష్యత్‌లో మంచే జరుగుతుందన్నారు.
టికెట్ అనేది త్వరలోనే తెలుస్తుందని, అయితే ప్రతి ఒక్కరూ కలిసి పార్టీకి విజయం చేకూర్చాలనే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ... టీ–హోప్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకుని కాంగ్రెస్ నాయకులందరూ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment