చాయ్ బిస్కట్‌తో మొదటి అవకాశం..
మెయిల్ సినిమా గుర్తింపు నిచ్చింది..
కల్కి సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నా..
‘సాక్షి’తో యువ నటుడు హర్షిత్ రెడ్డి
ఎంచుకున్న రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువేంకాదు.. ఇది ఒకప్పటి మాట.. టెక్నాలజీ రాకతో, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నేటి తరం యువత కలలు నెరవేర్చుకుంటున్నారు. సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలా తాను అనుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టిన వ్యక్తే హర్షిత్ రెడ్డి మల్గి...సరదాగా డబ్‌స్మాలతో మొదలై ప్రభాస్ కల్కి సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. చిన్నతనం నుంచి తనకు నటనపై ఉన్న సరదా.. అందులోనే నిలదొక్కుకునేందుకు చేసిన తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు.. తెలుసుకుందాం..
నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. బిటెక్ ఇక్కడే పూర్తి చేశాను. చిన్నతనం నుండే స్కూల్‌లో కల్చరల్ ఈవెంట్స్‌లో ఉత్సాహంగా సింగింగ్, యాక్టింగ్‌లలో సరదాగా పాల్గొనేవాడిని. 2018లో డబ్‌స్మాష్‌లను నేను సరదాగా చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చే«శాను. దీంతో ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. అలా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చాయ్‌బిస్కట్‌లో యాక్టర్‌గా కొన్ని స్కెచ్ విడియోస్ చేశాను. అలా మొదలైన నా ప్రస్థానం.. నేడు ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తున్న ప్రభాస్ కలి్క–2898 చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నా అని తెలిపారు హర్షిత్‌రెడ్డి మల్గి.
లాక్‌డౌన్‌లో యాక్టింగ్‌పై మరింత ఆసక్తి...
లాక్‌డౌన్‌లో వందలాది సినిమాలు చూశాను. అలా నటనపై మరింత ఆసక్తితో పాటు పలు మెళకువలు నేర్చుకున్నాను. అనంతరం ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. అలా ఆహాలో నటుడు ప్రియదర్శితో కలిసి ‘మెయిల్’ సినిమాలో మెయిన్ రోల్ చేశాను. థియేటర్‌లో కాకుండా ఆహాలో విడుదలయింది. తరగతిగదిదాటి, అర్థమైందా అరుణ్‌కుమార్, లూసర్ వెబ్‌సీరిస్‌లను చేశాను. అలా నటుడిగా మంచి మార్కులు సాధించి పలు అవార్డులను అందుకున్నాను. మెయిల్ చిత్రంలో నటనకు చాలా మంది మెచ్చుకున్నారు.
కల్కిలో అవకాశం...
సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ మంచి క్యారెక్టర్స్ రాలేదు. ఓ డిఫరెంట్ రోల్‌లో చేయాలనుకునే సమయంలో మెయిల్ చిత్రం ప్రొడ్యూసర్ స్వప్నదత్ ప్రభాస్‌తో కల్కి 2898 చిత్రాన్ని చేస్తున్నారు. ఓ మంచి రోల్ ఉంది చేస్తావా అని చిత్ర టీం అడగటంతో ఖచి్చతంగా చేస్తానని చెప్పాను. దర్శకుడు నాగ్‌అశి్వన్ మెయిల్ చిత్రం చూసి ఎటువంటి ఆడిషన్స్ లేకుండా సెలెక్ట్ చేశారు. హీరో ప్రభాస్‌తో కలిసి ఓ డిఫరెంట్ రోల్‌లో నటించడం చాలా సంతోషంగా ఉంది. థియేటర్‌లో రిలీజ్ అయ్యే నా మొదటి సినిమా పాన్ వరల్డ్ సినిమా అవ్వడం మరింత గర్వంగా ఉంది. చిత్రంలో నా క్యారెక్టర్ పేరుకూడా కొత్తగా ఉంటూ చిత్రంలోని బుజ్జి క్యారెక్టర్‌తో ఆద్యతం ప్రేక్షకులను అలరిస్తుంది.
హీరోగా రాణిస్తా...
ప్రేక్షకులను అలరిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ హీరో, నటుడిగా రాణించాలని ఉంది. తెలుగులో పుష్ఫ చూశాక అల్లు అర్జున్ బాగా నచ్చారు. అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. నా డ్రీమ్‌రోల్ సూపర్‌హీరో రోల్ చేయాలని ఉంది. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం ఇష్టం. హైదరాబాద్‌తో నాకు విడదీయలేని బంధం. ఇక్కడే నా లైఫ్ ప్రారంభమై సెలబ్రిటీ హోదాను తీసుకొచి్చంది. ఇండియన్ వంటకాలు ఇష్టం. హెల్తీ ఫుడ్ తీసుకొని తరచూ జిమ్ చేస్తుంటా. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండటానికే ఇష్టపడతా...
Comments
Please login to add a commentAdd a comment