harshith
-
సరదా.. సరదాకే..
ఎంచుకున్న రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువేంకాదు.. ఇది ఒకప్పటి మాట.. టెక్నాలజీ రాకతో, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నేటి తరం యువత కలలు నెరవేర్చుకుంటున్నారు. సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలా తాను అనుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టిన వ్యక్తే హర్షిత్ రెడ్డి మల్గి...సరదాగా డబ్స్మాలతో మొదలై ప్రభాస్ కల్కి సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. చిన్నతనం నుంచి తనకు నటనపై ఉన్న సరదా.. అందులోనే నిలదొక్కుకునేందుకు చేసిన తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు.. తెలుసుకుందాం.. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. బిటెక్ ఇక్కడే పూర్తి చేశాను. చిన్నతనం నుండే స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్‌లో ఉత్సాహంగా సింగింగ్, యాక్టింగ్‌లలో సరదాగా పాల్గొనేవాడిని. 2018లో డబ్‌స్మాష్‌లను నేను సరదాగా చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చే«శాను. దీంతో ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. అలా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చాయ్బిస్కట్లో యాక్టర్‌గా కొన్ని స్కెచ్ విడియోస్ చేశాను. అలా మొదలైన నా ప్రస్థానం.. నేడు ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తున్న ప్రభాస్ కలి్క–2898 చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నా అని తెలిపారు హర్షిత్‌రెడ్డి మల్గి. లాక్డౌన్లో యాక్టింగ్‌పై మరింత ఆసక్తి... లాక్డౌన్లో వందలాది సినిమాలు చూశాను. అలా నటనపై మరింత ఆసక్తితో పాటు పలు మెళకువలు నేర్చుకున్నాను. అనంతరం ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. అలా ఆహాలో నటుడు ప్రియదర్శితో కలిసి ‘మెయిల్’ సినిమాలో మెయిన్ రోల్ చేశాను. థియేటర్లో కాకుండా ఆహాలో విడుదలయింది. తరగతిగదిదాటి, అర్థమైందా అరుణ్‌కుమార్, లూసర్ వెబ్‌సీరిస్‌లను చేశాను. అలా నటుడిగా మంచి మార్కులు సాధించి పలు అవార్డులను అందుకున్నాను. మెయిల్ చిత్రంలో నటనకు చాలా మంది మెచ్చుకున్నారు. కల్కిలో అవకాశం... సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ మంచి క్యారెక్టర్స్ రాలేదు. ఓ డిఫరెంట్ రోల్లో చేయాలనుకునే సమయంలో మెయిల్ చిత్రం ప్రొడ్యూసర్ స్వప్నదత్ ప్రభాస్‌తో కల్కి 2898 చిత్రాన్ని చేస్తున్నారు. ఓ మంచి రోల్ ఉంది చేస్తావా అని చిత్ర టీం అడగటంతో ఖచి్చతంగా చేస్తానని చెప్పాను. దర్శకుడు నాగ్అశి్వన్ మెయిల్ చిత్రం చూసి ఎటువంటి ఆడిషన్స్ లేకుండా సెలెక్ట్ చేశారు. హీరో ప్రభాస్‌తో కలిసి ఓ డిఫరెంట్ రోల్లో నటించడం చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో రిలీజ్ అయ్యే నా మొదటి సినిమా పాన్ వరల్డ్ సినిమా అవ్వడం మరింత గర్వంగా ఉంది. చిత్రంలో నా క్యారెక్టర్ పేరుకూడా కొత్తగా ఉంటూ చిత్రంలోని బుజ్జి క్యారెక్టర్‌తో ఆద్యతం ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోగా రాణిస్తా... ప్రేక్షకులను అలరిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ హీరో, నటుడిగా రాణించాలని ఉంది. తెలుగులో పుష్ఫ చూశాక అల్లు అర్జున్ బాగా నచ్చారు. అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. నా డ్రీమ్‌రోల్ సూపర్‌హీరో రోల్ చేయాలని ఉంది. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం ఇష్టం. హైదరాబాద్‌తో నాకు విడదీయలేని బంధం. ఇక్కడే నా లైఫ్ ప్రారంభమై సెలబ్రిటీ హోదాను తీసుకొచి్చంది. ఇండియన్ వంటకాలు ఇష్టం. హెల్తీ ఫుడ్ తీసుకొని తరచూ జిమ్ చేస్తుంటా. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండటానికే ఇష్టపడతా... -
IPL 2024: ఎందుకంత ఓవరాక్షన్ బ్రో.. కొంచెం తగ్గించుకో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా ఓవరాక్షన్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం రానా సెలబ్రేషన్స్ శృతిమించాయి. ఏమి జరిగిందంటే? 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ మంచి అరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఫస్ట్ స్పెల్ వేసిన హర్షిత్ రానాను అగర్వాల్ టార్గెట్ చేశాడు. తొలి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ రానాను మయాంక్ ఒత్తడిలోకి నెట్టాడు. రానా తన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ కెప్టెన్ అయ్యర్ మాత్రం పవర్ ప్లేలో మరో ఓవర్ వేసే అవకాశమిచ్చాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రానా బౌలింగ్‌లో మయాంక్ భారీ షాట్‌కు ప్రయత్నించి రింకూ సింగ్ చేతికి చిక్కాడు. అయితే వికెట్ తీసిన సంతోషంలో రానా.. మయాంక్ దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మయాంక్ కూడా అతడి వైపు సీరియస్‌గా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఎందుకంత ఓవరాక్షన్ బ్రో.. కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓవరాల్‌గా రానా తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. Full on Aggression from Harshit Rana Delhi Boy for a reason 🥵💥pic.twitter.com/aXDlqavRr6 — Aditya (@switch_hit18) March 23, 2024 A heated send-off to Mayank Agarwal 🔥#IPL2024 pic.twitter.com/tzbDLgyDNL — OneCricket (@OneCricketApp) March 23, 2024 -
దయచేసి.. మా కుమారుడిని కాపాడండి!
ఖమ్మం: మెదడులో నీరు చేరడంతో అనారోగ్యం పాలైన ఓ విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బ్రెయిన్‌కు సర్జరీ చేస్తేనే బతుకుతాడని వైద్యులు సూచించడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేచిచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని గాదెపాడు గ్రామానికి చెందిన భూక్యా సంతు, ప్రమీల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడైన భూక్యా హర్షిత్ కారేపల్లిలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా మూడేళ్ల కిందట హర్షిత్‌కు జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి బ్రెయిన్లో నీరు చేరిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో హర్షిత్‌కు రెండుసార్లు బ్రెయిన్ సర్జరీ జరిగి కోలుకుంటున్న క్రమంలో ఇటీవల తిరిగి అనారోగ్యానికి గురికావడంతో రెయిన్‌బోకు తీసుకొచ్చారు. చికిత్స అనంతరం మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయాలని, సుమారు రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యు లు తెలపడంతో ఇప్పటికే ఇల్లు, వాకిలి అమ్ముకోవడంతో పాటు స్నేహితుల సహకారంతో రూ.12 లక్షల వరకు ఖర్చుచేశామని వాపోయారు. ఇదిలా ఉండగా హర్షిత్ తండ్రి సంతుకు 2021వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై బ్రెయిన్ సర్జరీ కావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తమ కుమారుడి ప్రాణాలైనా కాపాడుకుందామని, దాతలు సహకరించాలని హర్షిత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చదవండి: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా.. -
హైదరాబాద్ రాత మారలేదంతే! ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘోర ఓటమి
Ranji Trophy 2022-23 - Hyderabad vs Delhi: రంజీ ట్రోఫీ 2022-23ని హైదరాబాద్ క్రికెట్ జట్టు మరో ఓటమితో ముగించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఢిల్లీ జట్టుతో ఉప్పల్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఆట మూడో రోజు(గురువారం) ఓవర్‌నైట్ స్కోరు 223/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు ఆయుశ్ బదోని వీరోచిత సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసింది. అదరగొట్టిన ఆయుశ్ బదోని నిజానికి 277 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి 300 పరుగుల్లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే ఆయుశ్ బదోని (191; 24 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణరీతిలో ఆడి భారీ సెంచరీ సాధించాడు. పదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (58; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆయుశ్ ఢిల్లీ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. ఆయుశ్, హర్షిత్ తొమ్మిదో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ‘డబుల్ సెంచరీ’కి చేరువైన దశలో.. అనికేత్ రెడ్డి బౌలింగ్‌లో ఆయుశ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత దివిజ్ మెహ్రా (8 నాటౌట్)తో కలిసి హర్షిత్ చివరి వికెట్‌కు 34 పరుగులు జత చేశాడు. అజయ్‌దేవ్ గౌడ్ బౌలింగ్‌లో హర్షిత్ ఎల్బీగా వెనుదిరగడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 143 పరుగులిచ్చి 5 వికెట్లు, అజయ్‌దేవ్ గౌడ్ 87 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ భారీ స్కోరు ఈ నేపథ్యంలో 433 పరుగులకు ఆలౌటైన ఢిల్లీ 78 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి కేవలం 12 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 124 వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా ఇక తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్ రాయుడు.. రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులతో హైదరాబాద్ బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లలో తోల్కంటి గౌడ్ (21), ప్రణీత్ రాజ్ మాత్రమే (27) 20 పైగా పరుగులు చేశారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఢిల్లీ బౌలర్ హర్షిత్ రాణా ధాటికి బెంబేలెత్తి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 124 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. కాగా 12 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 7 వికెట్లు కూల్చి హైదరాబాద్ జట్టు పతనాన్ని శాసించిన హర్షిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరో ఢిల్లీ బౌలర్ దివిజ్ మెహ్రా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోయిన హైదరాబాద్ హైదరాబాద్ కేవలం ఒక్క పాయింట్‌తో గ్రూప్ ‘బి’లోనే కాకుండా ఎలైట్ లీగ్‌లోని నాలుగు గ్రూప్‌ల్లో కలిపి చివరి స్థానంలో నిలిచింది. కాగా ఎలైట్ గ్రూప్‌ల్లో ఓవరాల్‌గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోతాయి. రంజీ ట్రోఫీ 2022-23 హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ స్కోర్లు హైదరాబాద్- 355 & 124 ఢిల్లీ- 433 & 47/1 చదవండి: Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే? Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ -
మంచి నటుడు అనిపించుకోవాలనుంది
‘‘నేను లేను’ సినిమాలో నా పాత్ర కొత్తగా ఉంది. సినిమా డిఫరెంట్‌గా ఉంది అని అభినందిస్తున్నారు. నేను అనుకున్నదానికంటే ఈ సినిమా ఎక్కువ రీచ్ అయింది’’ అని హీరో హర్షిత్ అన్నారు. రామ్ కుమార్ దర్శకత్వంలో హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీ పద్మ, మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నేను లేను’. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. సుక్రి కుమార్ నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా హర్షిత్ పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘మాది కర్నూల్. ఇంటర్మీడియట్కి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. స్కూల్లో డ్యాన్స్ బాగా చేసేవాణ్ణి. నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడు రామ్‌కుమార్‌తో ఎనిమిదేళ్లుగా అనుబంధం ఉంది. ఇది వరకూ మేమిద్దరం ‘గణపతిబప్పా మోరియా’ సినిమా చేశాం. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. దాంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం. కొత్త కాన్సెప్ట్ కోరుకునేవారికి కచ్చితంగా నచ్చుతుంది. నెక్ట్స్ రెండు సినిమాలకు డిస్కషన్ జరుగుతున్నాయి. హీరోగా కాదు నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. -
అందమైన ప్రేమకథ
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి ముఖ్య తారలుగా రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్.యం విజన్– దివ్యాషిక క్రియేషన్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. రామ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇప్పటివరకు చూడని కొత్త కాన్సెప్ట్ మా సినిమాలో ఉంది. ఇటీవల విడుదల చేసిన మా చిత్రం ట్రైలర్ 75 లక్షల వ్యూస్‌ను అందుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రేక్షకులు తప్పకుండా మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. బిశ్వజిత్నాథ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, కెమెరా:ఎ. శ్రీకాంత్, సహనిర్మాత: యషిక. -
వివాహ వేడుక
-
ప్రేమలో థ్రిల్
హర్షిత్ హీరోగా రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్.యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ పతాకంపై సుక్రి కుమార్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేశారు. రామ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. కథనం, సంగీతం, కెమెరావర్క్ మా సినిమాకు ప్రత్యేక ఎసెట్‌గా నిలుస్తాయి. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, కెమెరా:ఎ. శ్రీకాంత్, సహ నిర్మాత: యాషిక. -
నాన్నే.. అమ్మేయాలని చూస్తున్నాడు!
గుంటూరు మెడికల్ : ‘మా నాన్న నన్ను అమ్మేయాలని చూస్తున్నాడు.. నాకు చదువుకోవాలని ఉంది.. నన్ను చదివిస్తే డాక్టర్ అవుతా.. నా విషయంలో అమ్మమ్మ నాన్నతో గొడవపడి శరీరం కాల్చుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది’ అంటూ ఓ బాలుడు ఆస్పత్రి అధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లికి చెందిన నాగమ్మ 20 రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఈ నెల 18న ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్ ఆస్పత్రిలో శానిటేషన్‌ను తనిఖీలు చేస్తున్న సమయంలో గుండా హర్షిత్ అనే 11 ఏళ్ల బాలుడు కంటపడ్డాడు. డాక్టర్ రమేష్‌ను చూడగానే ఆయన వద్దకు వచ్చి తన తండ్రి సత్యనారాయణ తనను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని, అందువల్లే అమ్మమ్మ గొడవపడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు రోదిస్తూ చెప్పాడు. శుక్రవారం సాయంత్రం ఆర్ఎంవో డాక్టర్ రమేష్ పిల్లవాడిని మంత్రి రావెల కిషోర్‌బాబు వద్దకు తీసుకొచ్చి పరిస్థితి వివరించారు బాలుడిని ఆదుకోవాలని ఆయన మంత్రిని కోరారు. బాలుడు హర్షిత్ కూడా తనకు చదువుకోవాలని ఉందనే విషయాన్ని మంత్రికి తెలియజేయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బాలుడిని చదివించేందుకు తాను సహకారం అందిస్తానని మంత్రి రావెల హామీ ఇచ్చారు. -
హర్షిత్ శుభారంభం
జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టాలెంట్ సిరీస్ టె న్నిస్ టోర్నీలో అండర్-12 బాలుర సింగిల్స్ విభాగంలో కొసరాజు హర్షిత్ శుభారంభం చేశాడు. సూర్యోదయ టెన్నిస్ అకాడ మీలో శనివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో హర్షిత్ 8-0తో ఆర్యంత్ రెడ్డిపై నెగ్గాడు. కౌశిక్ కుమార్ రెడ్డి 8-0తో అక్షిత్‌పై గెలిచాడు. సోహన్ 8-6తో హితేష్‌పై, అనికేత్ 8-4తో వరుణ్ కుమార్‌పై, రాహుల్ 8-1తో తరుణ్‌పై, సాయితేజ 8-2తో అర్చిత్‌పై నెగ్గారు. మిగతా ఫలితాలు: యశ్వంత్ 8-4తో ప్రతీ క్‌పై, సృజన్ 8-1తో అఖిలేష్‌పై, ప్రీతమ్ 8-2తో శౌర్యపై, బృహత్ 8-3తో విదుర్‌పై, శశిధర్ 8-2తో హర్షవర్ధన్‌పై, ఇక్బాల్ 8-0తో ఆది రోహన్‌పై, ప్రణవ్ 8-1తో రుషికేశ్పై, జయంత్ 8-5తో కార్తీక్‌పై, దీపక్ 8-5తో శివాన్వేష్పై, ఆకాశ్ 8-3తో వంశీకృష్ణపై నెగ్గారు. బాలికల అండర్-12 మొదటి రౌండ్: ప్రవళిక 8-0తో రితికా రెడ్డిపై, వేద వర్షిత 8-7, 7-4తో అదితిపై, సుమన 8-3తో మేఘనపై, సాహిష్న సాయి 8-3తో తనుషితా రెడ్డిపై, నిధి 8-1తో సౌమ్య జైన్‌పై గెలిచారు.