
హర్షిత్
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి ముఖ్య తారలుగా రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్.యం విజన్– దివ్యాషిక క్రియేషన్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. రామ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది.
మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇప్పటివరకు చూడని కొత్త కాన్సెప్ట్ మా సినిమాలో ఉంది. ఇటీవల విడుదల చేసిన మా చిత్రం ట్రైలర్ 75 లక్షల వ్యూస్‌ను అందుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రేక్షకులు తప్పకుండా మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. బిశ్వజిత్‌నాథ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, కెమెరా:ఎ. శ్రీకాంత్, సహనిర్మాత: యషిక.
Comments
Please login to add a commentAdd a comment