మంచి నటుడు అనిపించుకోవాలనుంది | Nenu Lenu Movie Hero Harshith Interview | Sakshi
Sakshi News home page

మంచి నటుడు అనిపించుకోవాలనుంది

Published Sun, Jul 28 2019 3:08 AM | Last Updated on Sun, Jul 28 2019 3:08 AM

Nenu Lenu Movie Hero Harshith Interview - Sakshi

‘‘నేను లేను’ సినిమాలో నా పాత్ర కొత్తగా ఉంది. సినిమా డిఫరెంట్‌గా ఉంది అని అభినందిస్తున్నారు. నేను అనుకున్నదానికంటే ఈ సినిమా ఎక్కువ రీచ్‌ అయింది’’ అని హీరో హర్షిత్‌ అన్నారు. రామ్‌ కుమార్‌ దర్శకత్వంలో హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీ పద్మ, మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నేను లేను’. లాస్ట్‌ ఇన్‌ లవ్‌ అనేది ఉపశీర్షిక. సుక్రి కుమార్‌ నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం రిలీజ్‌ అయింది. ఈ సందర్భంగా హర్షిత్‌ పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘మాది కర్నూల్‌.

ఇంటర్మీడియట్‌కి హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యాం. చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. స్కూల్లో డ్యాన్స్‌ బాగా చేసేవాణ్ణి. నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడు రామ్‌కుమార్‌తో ఎనిమిదేళ్లుగా అనుబంధం ఉంది. ఇది వరకూ మేమిద్దరం ‘గణపతిబప్పా మోరియా’ సినిమా చేశాం. కమర్షియల్‌గా వర్కౌట్‌ కాలేదు. దాంతో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం. కొత్త కాన్సెప్ట్‌ కోరుకునేవారికి కచ్చితంగా నచ్చుతుంది. నెక్ట్స్‌ రెండు సినిమాలకు డిస్కషన్‌ జరుగుతున్నాయి. హీరోగా కాదు నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement