Matru Devo Bhava Movie Fame Senior Actress Madhavi Latest Photos Viral - Sakshi
Sakshi News home page

Senior Actress Madhavi: నటి మాధవి ఇప్పుడు ఎలా ఉందో చూశారా? షాక్‌ అవుతున్న ఫ్యాన్స్‌

Mar 20 2023 10:40 AM | Updated on Mar 20 2023 11:21 AM

Senior Actress, Matrudevobhava Fame Madhavi Latest Photos Goes Viral - Sakshi

వెండితెరపై అలరించిన అలనాటి తారలేందరో ప్రస్తుతం కనుమరుగయ్యారు. అందులో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్స్‌ కూడా ఉన్నారు. 80,90లో తమ అందం, అభిమనయంతో ఆకట్టుకున్న ఎంతో స్టార్‌ హీరోయిన్స్‌ వెండితెరకు దూరమై పర్సనల్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నారు. అందులో సీనియర్‌ నటి, ‘మాతృదేవోభవ’ ఫేం మాధవి ఒకరు. అందంలో జయసుధ, జయప్రద వంటి హీరోయిన్స్‌కి పోటినిచ్చిన ఆమె ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారంటూ ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు.

సోషల్‌ మీడియాలో ఆమె లేటెస్ట్‌ ఫొటోలు చూసి అభిమానులంతా షాక్‌ అవుతున్నారు. తన తెనె కళ్లలతో మాయ చేసిన ఆమె ఇంతలా మారిపోయారేంటంటూ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మెప్పించిన మాధవి దాదాపు 300 సినిమాల వరకు చేశారు. చిరంజీవి ‘ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైది వంటి సినిమాల్లో ఆమె చిరంజీవికి జోడికట్టారు.

చెప్పాలంటే అప్పట్లో చిరు-మాధవి పెయిర్‌ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉండేది. ఇక మాధవి గ్లామర్‌, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యం తన కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్‌ ఎంతో మంది ఉన్నారు. అందులో లేడి ఫ్యాన్స్‌ కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్లకే సినీరంగ​ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగారు. ఇక ఆమె కెరీర్‌లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ‘మాతృదేవోభవ’. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్‌ ఇప్పటికి ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది.

ముఖ్యం ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అలా నటిగా కెరీర్‌ పీక్‌లో ఉండగానే మాధవి సడెన్‌గా వెండితెరకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన బిజినెస్‌ మెన్‌ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని ఫారిన్‌లో సెటిలైపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలు ఎదగడంతో భర్తకు సాయంగా బిజినెస్‌ వ్యవహరాలను చూసుకుంటున్న మాధవి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటోలు షేర్‌ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లెటెస్ట్‌ ఫొటోలు చూసి నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement