జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్‌గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
తన బాల్యంలో చెన్నైలో చెపాక్ స్టేడియం(ఇప్పటి చిదంబరం స్టేడియం) దగ్గర్లోనే తమ నివాసముండేదని జయసుధ తెలిపింది. మా ఇంటికి.. గ్రౌండ్‌కు మధ్య ఒక రోడ్డు మాత్రమే ఉండేదని వివరించింది. అక్కడే ఉన్న హిందూ స్కూల్లో చాలామంది సినిమా, క్రికెట్ ప్రముఖులు కూడా చదువుకున్నారు. తనకు చిన్న వయసులో అక్కడే చాలా క్రికెట్ మ్యాచులు జరుగుతుండేవని పేర్కొంది. నేను చాలాసార్లు స్టేడియంలోకి వెళ్లి మ్యాచులు చూసేవాళ్లమని చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో తనకు ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే క్రష్ ఏర్పడిందని ఆమె తెలిపింది. అప్పట్లో అందరికంటే అతను హ్యాండ్‌సమ్‌గా ఉండేవారని జయసుధ తెలిపింది. అంతే కాకుండా ఆయనను చాలామంది ఇష్టపడేవారని వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో జయసుధ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
జయసుధ మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేను క్రికెటర్ అవ్వాలని అనుకున్నా. సెకండ్ ఆప్షన్ సినిమా. ఇక మూడోది టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని. కానీ ఈ క్యారెక్టర్ అన్ని సినిమాల్లో చేశాను. లక్కీగా 12 ఏళ్లకే మొదటి సినిమా చేశా. అప్పట్లో మంజుల గారు చాలా ఫేమస్. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఆమె చేయలేని సినిమాలకు నన్ను పరిచయం చేసేవారు. అలా శోభన్ బాబుతో మొదటి సినిమా చేశా. నా అసలు పేరు సుజాత. అప్పటికే మలయాళంలో ఆ పేరుతో మరో హీరోయిన్ ఉండేది. గుహనాథన్ అనే ఒక తమిళ రైటర్ జయసుధ అనే పేరును సూచించారు. నాకు మొదటి నుంచి సినిమా చేసే లక్షణాలు లేవు. నాకు క్రికెట్ అంటే పిచ్చి. షూటింగ్‌లో ఉన్నప్పుడు కామెంటరీ వినేందుకు సిగ్నల్ కోసం అలా వెళ్లిపోయేదాన్ని. క్రికెట్‌లో నా ఫేవరేట్ సునీల్ గవాస్కర్, ఏక్‌నాథ్ సోల్కర్ అని ఒకాయన ఉండేవారు. సినిమాల వాళ్లకు క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో టీనేజర్‌గా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ నా క్రష్. అతను చాలా హ్యాండ్‌సమ్‌గా ఉండేవారు. నేనే కాదు.. చాలామంది ఆయన్ను చూసేందుకే మ్యాచులకు వచ్చేవారు. ' అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది.
Comments
Please login to add a commentAdd a comment