జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టాలెంట్ సిరీస్ టె న్నిస్ టోర్నీలో అండర్-12 బాలుర సింగిల్స్ విభాగంలో కొసరాజు హర్షిత్ శుభారంభం చేశాడు. సూర్యోదయ టెన్నిస్ అకాడ మీలో శనివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో హర్షిత్ 8-0తో ఆర్యంత్ రెడ్డిపై నెగ్గాడు. కౌశిక్ కుమార్ రెడ్డి 8-0తో అక్షిత్‌పై గెలిచాడు. సోహన్ 8-6తో హితేష్‌పై, అనికేత్ 8-4తో వరుణ్ కుమార్‌పై, రాహుల్ 8-1తో తరుణ్‌పై, సాయితేజ 8-2తో అర్చిత్‌పై నెగ్గారు.
మిగతా ఫలితాలు: యశ్వంత్ 8-4తో ప్రతీ క్‌పై, సృజన్ 8-1తో అఖిలేష్‌పై, ప్రీతమ్ 8-2తో శౌర్యపై, బృహత్ 8-3తో విదుర్‌పై, శశిధర్ 8-2తో హర్షవర్ధన్‌పై, ఇక్బాల్ 8-0తో ఆది రోహన్‌పై, ప్రణవ్ 8-1తో రుషికేశ్‌పై, జయంత్ 8-5తో కార్తీక్‌పై, దీపక్ 8-5తో శివాన్వేష్‌పై, ఆకాశ్ 8-3తో వంశీకృష్ణపై నెగ్గారు.
బాలికల అండర్-12 మొదటి రౌండ్: ప్రవళిక 8-0తో రితికా రెడ్డిపై, వేద వర్షిత 8-7, 7-4తో అదితిపై, సుమన 8-3తో మేఘనపై, సాహిష్న సాయి 8-3తో తనుషితా రెడ్డిపై, నిధి 8-1తో సౌమ్య జైన్‌పై గెలిచారు.
హర్షిత్ శుభారంభం
Published Sat, Jan 11 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement