IPL 2024: ఎందుకంత ఓవరాక్షన్ బ్రో.. కొంచెం తగ్గించుకో! వీడియో వైరల్‌ | IPL 2024: Harshit Rana Gives Flying Kiss SendOff To Mayank Agarwal, Netizens Reactions On Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 KKR Vs SRH: ఎందుకంత ఓవరాక్షన్ బ్రో.. కొంచెం తగ్గించుకో! వీడియో వైరల్‌

Published Sun, Mar 24 2024 7:00 AM | Last Updated on Sun, Mar 24 2024 12:23 PM

Harshit Rana Blows Mayank Agarwal A Flying Kiss in send off - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా ఓవరాక్షన్ చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం రానా సెలబ్రేషన్స్ శృతిమించాయి. 

ఏమి జరిగిందంటే?
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్‌, అభిషేక్ శర్మ మంచి అరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఫస్ట్ స్పెల్ వేసిన హర్షిత్ రానాను అగర్వాల్ టార్గెట్ చేశాడు. తొలి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ రానాను మయాంక్ ఒత్తడిలోకి నెట్టాడు. రానా తన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ కెప్టెన్ అయ్యర్ మాత్రం పవర్ ప్లేలో మరో ఓవర్ వేసే అవకాశమిచ్చాడు.

ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రానా బౌలింగ్‌లో మయాంక్ భారీ షాట్‌కు ప్రయత్నించి రింకూ సింగ్ చేతికి చిక్కాడు. అయితే వికెట్ తీసిన సంతోషంలో రానా.. మయాంక్ దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చూస్తూ  ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మయాంక్ కూడా అతడి వైపు సీరియస్‌గా చూశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఎందుకంత ఓవరాక్షన్ బ్రో.. కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓవరాల్‌గా రానా తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement