PC: IPL.com
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. వరుసగా విఫలమవుతున్న ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు హ్యారీ బ్రూక్.. ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపించాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
55 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. అదే విధంగా కెప్టెన్ మార్‌క్రమ్ 26 బంతుల్లో 50 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ కెప్టెన్(71), రింకూ సింగ్ పోరాడనప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.
తీరు మారని మయాంక్..
ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించినప్పటికీ.. ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పేలవ ఫామ్ మాత్రం అందరని కలవరపెడుతుంది. బ్యాటింగ్‌కు అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై 13 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. రస్సెల్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి అతడు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అగర్వాల్ కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక గతేడాది సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహించిన మయాంక్‌ను.. 2023 సీజన్‌కు ముందు ఆ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రూ 8.25 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది. అయితే తన తీసుకున్న మొత్తానికి న్యాయం చేయడంలో మయాంక్ విఫలమవుతున్నాడు. ఇక వరుసగా విఫలమవుతున్న అగర్వాల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆటకే పంజాబ్ విడిచిపెట్టింది.. ఇక్కడ కూడా అదే ఆట తీరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చదవండి: Harry Brook: 'గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు'
On his first ball of the season, Dre Russ sends Agarwal... 𝑝𝑎𝑐𝑘𝑖𝑛𝑔 𝑎𝑛𝑑 𝑚𝑜𝑣𝑖𝑛𝑔 🚚
— JioCinema (@JioCinema) April 14, 2023
..and picks Tripathi in the same over! 😯#KKRvSRH #IPL2023 #TATAIPL | @Russell12A @KKRiders pic.twitter.com/8405ZAWnMA
Comments
Please login to add a commentAdd a comment