
కూకట్‌పల్లి(హైదరాబాద్): లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఉద్యోగి సునీత ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మూసాపేట సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో సునీత సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ బాధితుడు మూసాపేటలో తన తల్లిదండ్రులకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ను తన పేరు మీద మ్యుటేషన్ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించాడు. రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న సునీత తనకు సంబంధించిన విధులు కాకపోయినప్పటికీ..
ఈ విషయంలో కలుగజేసుకుని.. ఆస్తి పన్ను మ్యుటేషన్ చేసేందుకు రూ.80 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం. సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఇచ్చిన కరెన్సీ నోట్లను తీసుకుని మొదటి విడతగా రూ.30 వేలు ఆమెకు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు సునీతతో పాటు రెవెన్యూ శాఖలో పని చేసే పలువురిని ప్రశ్నించినట్లు తెలిసింది. లంచం విషయంలో కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఏసీపీ అధికారులు అనుమానిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయంలో వివిధ చోట్ల సోదాలు చేశారు. ఈ మేరకు సునీతను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.