GHMC employee
-
ఉరేసుకొని యువతి ఆత్మహత్య
సాక్షి, నాగోలు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటి జంగయ్యనగర్ కాలనీలో నివాసం ఉండే జ్యోతి జీహెచ్ఎంసీలో ఉద్యోగి. జ్యోతి భర్త ప్రేమ్‌దాస్ గతంలోనే చనిపోయాడు. కుమారుడు ప్రదీప్‌కుమార్, కుమారై లక్ష్మిప్రియాంక(19)లతో కలిసి ఉంటోంది. లక్ష్మి ప్రియాంక ప్రస్తుతం కొత్తపేటలోని శ్రీనేత్ర చికిత్సాలయంలో ఉద్యోగం చేస్తోంది. శనివారం ఉదయం యాథావిధిగా తల్లి ఉద్యోగానికి వెళ్లగా సోదరుడు ప్రదీప్‌కుమార్ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి ఇంటికి వచ్చి డోర్ కొట్టగా తీయలేదు. దీంతో తలుపు పగలగొట్టి చూడగా లక్ష్మిప్రియాంక ఉరేసుకొని కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రదీప్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
జీహెచ్ఎంసీ ఉద్యోగికి చుక్కలు చూపించారు
సికింద్రాబాద్: ఈ ఫొటోలో చిల్లర నాణేలు లెక్కించుకుంటున్నది జీహెచ్ఎంసీ ఉద్యోగి.. పేరు శ్రీకాంత్. నగరంలోని వారాసిగూడలో ఉన్న ఓ ఇంటిపై పన్ను చెల్లించాలని ఆ ఇంటి యజమానికి ఇచ్చిన వాయిదాలు దాటిపోయాయి. దీంతో పన్ను చెల్లించాలని సదరు ఉద్యోగి యజమానిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఆయన గత కొన్నేళ్లుగా దాచిపెట్టిన రూ.10, రూ.5 నాణేలను తీసుకొచ్చి శ్రీకాంత్ ఎదుట కుమ్మరించాడు. చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.30 వేలకు నాణేలను తీసుకోవాలని కోరాడు. వాటిని లెక్కించుకుని రశీదు ఇచ్చే సరికి శ్రీకాంత్‌కు బొమ్మ కనపడింది. -
కూకట్పల్లి జీహెచ్ఎంసీ ఉద్యోగి ఆత్మహత్య
-
జీహెచ్ఎంసీ కార్మికుడి ఆత్మహత్య
హైదరాబాద్: కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని జీహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న బలేశ్వర్ గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.