
నాణేలు లెక్కిస్తున్న జీహెచ్‌ఎంసీ ఉద్యోగి శ్రీకాంత్.
సికింద్రాబాద్: ఈ ఫొటోలో చిల్లర నాణేలు లెక్కించుకుంటున్నది జీహెచ్‌ఎంసీ ఉద్యోగి.. పేరు శ్రీకాంత్. నగరంలోని వారాసిగూడలో ఉన్న ఓ ఇంటిపై పన్ను చెల్లించాలని ఆ ఇంటి యజమానికి ఇచ్చిన వాయిదాలు దాటిపోయాయి. దీంతో పన్ను చెల్లించాలని సదరు ఉద్యోగి యజమానిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఆయన గత కొన్నేళ్లుగా దాచిపెట్టిన రూ.10, రూ.5 నాణేలను తీసుకొచ్చి శ్రీకాంత్ ఎదుట కుమ్మరించాడు.
చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.30 వేలకు నాణేలను తీసుకోవాలని కోరాడు. వాటిని లెక్కించుకుని రశీదు ఇచ్చే సరికి శ్రీకాంత్‌కు బొమ్మ కనపడింది.
Comments
Please login to add a commentAdd a comment