
నల్గొండ: నిడమనూరు మండలం తుమ్మడము గ్రామానికి చెందిన యడవెల్లి లహరి (28) గుండె పోటుతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందింది. తుమ్మ డం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు , మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయి రెడ్డి తనయుడు వల్లభ్ రెడ్డి భార్య లహరి. హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం అందరూ టిఫిన్ చేశారు.
టిఫిన్ చేసిన కొద్ది సేపటికి వేరే రూమ్ కు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడి పోయింది. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా డిండి మండలం నేరెడుకొమ్ము గ్రామానికి చెందిన లహరి కు యడవెల్లి వల్లభ్ రెడ్డి తో గత సంవత్సరం ఏప్రిల్ లో వివాహం జర్పించారు. వివాహం జరిగి 15 నెలలకే లహరి మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
వివిధ పార్టీలకు చెందిన నాయకులు లహరి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. లహరి అంత్యక్రియలు నిడమానూరు మండలం తుమ్మడం గ్రామంలో శనివారం ఉదయం 10-12 గంటల మధ్య నిర్వహించనున్నారు.