yadavelli
-
పెళ్లైన 15 నెలలకే విషాదం.. గుండెపోటుతో లహరి మృతి
నల్గొండ: నిడమనూరు మండలం తుమ్మడము గ్రామానికి చెందిన యడవెల్లి లహరి (28) గుండె పోటుతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందింది. తుమ్మ డం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు , మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయి రెడ్డి తనయుడు వల్లభ్ రెడ్డి భార్య లహరి. హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం అందరూ టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన కొద్ది సేపటికి వేరే రూమ్ కు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడి పోయింది. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా డిండి మండలం నేరెడుకొమ్ము గ్రామానికి చెందిన లహరి కు యడవెల్లి వల్లభ్ రెడ్డి తో గత సంవత్సరం ఏప్రిల్ లో వివాహం జర్పించారు. వివాహం జరిగి 15 నెలలకే లహరి మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు లహరి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. లహరి అంత్యక్రియలు నిడమానూరు మండలం తుమ్మడం గ్రామంలో శనివారం ఉదయం 10-12 గంటల మధ్య నిర్వహించనున్నారు. -
అపరాల పంటలను ప్రోత్సహించాలి : యడవల్లి
హాలియా : నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో అపరాల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులను లాభాల బాటలో నడిపించవచ్చని మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మండలంలోని ఆయకట్టు ప్రాంతంలో సుమారు 600 ఎకరాల్లో పీయూ31 రకం మినుము పంటను సాగు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వ్యవసాయాధికారులతో కలిసి పంటలను పరిశీలించారు. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా మండలంలో 20ఎకరాలు సాగు చేయగా ప్రస్తుతం 600 ఎకరాలు సాగు చేయడం గర్వనీయమన్నారు. పీయూ31 రకం చీడపీడలను తట్టుకోవడమే కాకుండా దిగుబడి కూడా అదనంగా పొందవచ్చని వ్యవసాశాఖ అధికారులు తెలిపారు. ఎల్లోమెజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. దీని పంటకాలం 70రోజులేన న్నారు. కందిలో అంతర్పంటగా వేసుకోవచ్చన్నారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి తిప్పన విజయేందర్‌రెడ్డి, చింతల చంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, మిట్టపల్లి వాసులు ఉన్నారు.