హైదరాబాద్: హిమాయత్‌నగర్‌కు చెందిన వివాహిత లహరి మృతి వివాదాస్పదంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఆమె గుండెపోటుతో మృతిచెందిందని లహరి తండ్రి జైపాల్‌రెడ్డికి సమాచారం అందింది. తాజాగా ఆమె గుండెపోటుతో కాదని.. తలపై, శరీరంపై గాయాలవ్వడం వల్లే మృతి చెందిందంటూ వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంలో మొదట నుంచి అనుమానంగా ఉన్న ఆమె భర్త వల్లభ్‌రెడ్డిని నారాయణగూడ పోలీసులు బుధవారం నల్లగొండలో అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే...హిమాయత్‌నగర్‌కు చెందిన జైపాల్‌రెడ్డి పెద్ద కుమార్తె లహరికి గత ఏడాది నల్లగొండ జిల్లాకు చెందిన వల్లభ్‌రెడ్డితో వివాహం జరిగింది. ఈ నెల 15వ తేదీన లహరి గుండెపోటుకు గురై మృతిచెందినట్లు జైపాల్‌రెడ్డికి సమాచారం అందింది. దీనిపై అదేరోజు తన కుమార్తె మరణంపై అనుమానం లేదంటూనే..తన కుమార్తె మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ జైపాల్‌రెడ్డి నారాయణగూడ పోలీసులకు రెండు విధాలుగా ఫిర్యాదు చేశాడు.
దీనిపై 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లహరి తలకు బలమైన గాయాలయ్యాయని, అందువల్లే మృతిచెందిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో లహరి భర్త వల్లభ్‌రెడ్డిని పోలీసులు బుధవారం నల్లగొండలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. అనంతరం రిమాండ్‌కు పంపినట్లు నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment