పాలకుర్తి/పాలకుర్తి టౌన్/కొడకండ్ల/పెద్దవంగర : ఆడబిడ్డగా మీ ముందుకొచ్చాను.. ఆశీర్వదించి గెలిపించండి.. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది అభివృద్ధి మార్క్ చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా సోమవారం కొడకండ్ల మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. మా అత్త మామ హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి ఝాన్సీరెడ్డి ముప్పై ఏళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం.. దోచుకొవడానికి దాచుకొవడానికి కాదు.. అది మా కుటుంబ నైజం కాదు.. దగాకోరు దయాకర్‌రావు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుయాయులకే కట్టబెట్టారు.. తనను గెలిపిస్తే అర్హులందరి కీ అందేలా చూస్తానన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకురాలి గా పనిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేతనాన్ని కూడా ప్రజల అభివృద్ధికే వెచ్చిస్తానని అన్నా రు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను రూపొందించింద ని, అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలి పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది.. ప్రజలు అండగా నిలిచి పాలకుర్తిలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ప్రవీణ్‌కుమార్, పార్టీ మండల కోఆప్షన్ సభ్యుడు నసీరుద్దీన్, నాయకులు అబ్దుల్లా, పులి గణేష్, వెంగల్‌రావు, సురేష్‌నాయక్, రాజేష్‌నాయక్, ఉప్పల చిన్నసోమయ్య, వనం మోహన్, మనోహర్, వంశీకృష్ణ, సోమనర్సయ్య, భిక్షపతి, యాకేష్ పాల్గొన్నారు.
కేసీర్ కుటుంబమే బాగుపడింది
పాలకుర్తి మండల పరిధి అయ్యంగారిపల్లి, గోపాలపురం, రాఘవాపురం, కిష్టాపురంతండా, పెద్దతండా, బమ్మెర గ్రామాల్లో యశస్వినిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం యశస్వినిరెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల బీఎస్‌ఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి, దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు వంటి పేర్లు చెప్పి కేసీఆర్ ప్రజలను వంచించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, తిరుమలగిరి, సర్పంచ్‌లు బక్క పుల్లయ్య, జలగం నాగభూషనం, మంద కొమురయ్య, సోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది
పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని టీపీసీసీ సభ్యురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. సోమవారం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ బొమ్మెర స్వరూప, 10వ వార్డు సభ్యులు రాంపాక లావణ్య, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ జలగం ప్రభాకర్ తదితరులు యాసారపు కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సంర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన బీఆర్‌ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. ఇక నుంచి కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేంది లేదని హెచ్చరించారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్వినిరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అశోక్, శేఖర్, యాకయ్య, రంజాన్, రజిత, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment