Palakurthi assembly
-
ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ
పాలకుర్తి/పాలకుర్తి టౌన్/కొడకండ్ల/పెద్దవంగర : ఆడబిడ్డగా మీ ముందుకొచ్చాను.. ఆశీర్వదించి గెలిపించండి.. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది అభివృద్ధి మార్క్ చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా సోమవారం కొడకండ్ల మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. మా అత్త మామ హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి ఝాన్సీరెడ్డి ముప్పై ఏళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం.. దోచుకొవడానికి దాచుకొవడానికి కాదు.. అది మా కుటుంబ నైజం కాదు.. దగాకోరు దయాకర్‌రావు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుయాయులకే కట్టబెట్టారు.. తనను గెలిపిస్తే అర్హులందరి కీ అందేలా చూస్తానన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకురాలి గా పనిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేతనాన్ని కూడా ప్రజల అభివృద్ధికే వెచ్చిస్తానని అన్నా రు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను రూపొందించింద ని, అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలి పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది.. ప్రజలు అండగా నిలిచి పాలకుర్తిలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ప్రవీణ్‌కుమార్, పార్టీ మండల కోఆప్షన్ సభ్యుడు నసీరుద్దీన్, నాయకులు అబ్దుల్లా, పులి గణేష్, వెంగల్రావు, సురేష్‌నాయక్, రాజేష్‌నాయక్, ఉప్పల చిన్నసోమయ్య, వనం మోహన్, మనోహర్, వంశీకృష్ణ, సోమనర్సయ్య, భిక్షపతి, యాకేష్ పాల్గొన్నారు. కేసీర్ కుటుంబమే బాగుపడింది పాలకుర్తి మండల పరిధి అయ్యంగారిపల్లి, గోపాలపురం, రాఘవాపురం, కిష్టాపురంతండా, పెద్దతండా, బమ్మెర గ్రామాల్లో యశస్వినిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం యశస్వినిరెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల బీఎస్ఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి, దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు వంటి పేర్లు చెప్పి కేసీఆర్ ప్రజలను వంచించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, తిరుమలగిరి, సర్పంచ్‌లు బక్క పుల్లయ్య, జలగం నాగభూషనం, మంద కొమురయ్య, సోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని టీపీసీసీ సభ్యురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. సోమవారం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ బొమ్మెర స్వరూప, 10వ వార్డు సభ్యులు రాంపాక లావణ్య, బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ జలగం ప్రభాకర్ తదితరులు యాసారపు కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సంర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. ఇక నుంచి కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేంది లేదని హెచ్చరించారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్వినిరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అశోక్, శేఖర్, యాకయ్య, రంజాన్, రజిత, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రబెల్లికి ఎన్నారై ట్రబుల్ !
సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించే లక్ష్యంతో హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఓ ఎన్ఆర్ఐ మహిళను రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆమెకు పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారింది. దీంతో ఆమె కోడలికి పాలకుర్తి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాకు పౌరసత్వం సమస్యను సృష్టిస్తే..వారసత్వంతో కొడతా అంటోంది ఆ ఎన్ఆర్ఐ. ఎర్రబెల్లిని ఓడిస్తా అంటున్న ఆ ఎన్ఆర్ఐ ఎవరు? ఏమా కథ? ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ రక్తికట్టిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కంచుకోటగా ఉన్న పాలకుర్తిలో తాజా రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సరికొత్త అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపింది. ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేశారు. ఎర్రబెల్లికి ఉన్న రాజకీయ అనుభవంలో సగం వయస్సుకూడా లేని యువతి రాజకీయ అరంగేట్రం చేసి..ఎన్నికల బరిలో దిగడం ఇప్పుడు పాలకుర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థులిద్దరూ ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పటి వరకు ఓ సారి ఎంపీగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. తనపై పోటీ చేసి ఓటమి పాలైన రాజకీయ ప్రత్యర్ధులు మళ్ళీ పోటీకి ఆసక్తి చూపలేని పరిస్థితి తీసుకొచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్రమంత్రిగా కొనసాగుతూ ఏడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు పాలకుర్తి నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉన్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పోటీకి సిద్ధమై మూడు మాసాల క్రితం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశారు. సొంతూరు పాలకుర్తికి రాగానే కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపారు. ఆమె రాకతో రాజకీయంగా కాస్త ఇబ్బంది పడ్డారు ఎర్రబెల్లి. సరైన అభ్యర్థి దొరికారని కాంగ్రెస్ సంబరపడుతుండగా ఝాన్సీరెడ్డి పౌరసత్వ సమస్య పోటీకి అడ్డంకిగా మారింది. అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీరెడ్డి ఇండియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సకాలంలో ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. ఇక ఎర్రబెల్లి పై పోటీకి సరైన అభ్యర్థి లేరని అందరూ అనుకుంటుండగా...రాజకీయ అనుభవం లేకున్నా.. ఎర్రబెల్లిని ఎదుర్కోవడమే కర్తవ్యంగా భావిస్తూ ఝాన్సీరెడ్డి తన కోడలు యశస్వినిరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థి కోడలు యశశ్వనిరెడ్డితో కలిసి అత్త నియోజకవర్గంలో ఎంట్రీతోనే సత్తా చాటారు. భారీ ర్యాలీతో గులాబీ గూటిలో గుబులు పుట్టించారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునే దశలో ఉన్న ఝాన్సీరెడ్డి పౌరసత్వం రాకుండా అడ్డుకుంటే వారసత్వంతో ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు అమెరికాను వదిలి పురిటిగడ్డకు వచ్చిన బిడ్డలాంటి కోడలును ఆశీర్వదిస్తే సమ్మక్క సారక్క మాదిరిగా సేవలందిస్తామని పాలకుర్తి ప్రజల్లో జోష్ నింపారు. మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎర్రబెల్లి మాత్రం ప్రత్యర్థులు ఎవరైనా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారాచ్యూట్ నేతలకు పాలకుర్తిలో స్థానం లేదంటున్నారు. రాజకీయంగా ఝాన్సీరెడ్డి దూకుడు పెంచడంతో మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గం అంతా కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. పాలకుర్తిలో సర్వే రిపోర్ట్ లు సైతం ఆందోళన కలిగిస్తుండడంతో ఎర్రబెల్లి వినూత్న పద్ధతిలో ప్రచారం సాగిస్తూ ప్రజల మనిషిగా రికార్డు సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయ పరిణామాలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఎర్రబెల్లి తోపాటు ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు సైతం రంగంలోకి దిగి సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమై ప్రచారం సాగిస్తున్నారు. అటు కాంగ్రెస్ కేడర్‌తో ఝాన్సీరెడ్డి ఆమె కోడలు యశశ్వనిరెడ్డి.. ఇటు ఎర్రబెల్లి కుటుంబసభ్యులు, గులాబీ పార్టీ శ్రేణులు ఎత్తుకు పై ఎత్తులతో ప్రచారాన్ని హోరెత్తించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎర్రబెల్లికి ఎదురు లేదనుకున్న పాలకుర్తిలోఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి రాకతో రాజకీయం అలజడి మొదలైంది. పోటాపోటీ ప్రచారాలతోపాటు ఇరుపక్షాలవారు వలస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. నేతల మధ్య మాటల యుద్దం కొనసాగితే అనుచరులు మాత్రం వాట్సాప్ వేదికగా వార్ సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు శృతిమించి కేసుల వరకు వెళ్ళాయి. రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి కి వణుకు పుట్టించే పరిస్థితి ఈసారి ఎన్నికల్లో వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని ఇలాంటి నాయకులను ఎంతో మందిని చూసిన ఎర్రబెల్లికి ఈ ఎన్నిక ఓ లెక్క కాదనే వాదనా వినిపిస్తోంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. -
పాలకుర్తి నుంచి మంత్రి దయాకర్‌రావుపై పోటీకి సిద్ధం: కొండా సురేఖ
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ అవకాశమిస్తే పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై పోటే చేసేందుకు సిద్ధమని కొండా సురేఖ ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఈ విషయాన్ని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొండా సురేఖ ఈమేరకు మాట్లాడారు. 'వరంగల్‌లో రేవంత్ సభ అనగానే మంత్రి దయాకర్‌రావుకు నిద్ర పట్టడం లేదు. పాలకుర్తిలో మీరన్నా పోటీ చేయాలి. లేదా మేమైనా పోటీ చేస్తాం. మీ లేదా మా చేతిలో దయాకర్‌రావు ఓడిపోవాలి అని చెబుతున్నాం’ అని రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ‘నేను ఒక్క తల్లి, తండ్రికి పుడితే టీడీపీని వీడను అని దయాకర్‌రావు.. అన్నడు. బీఆర్ఎస్లో ఎప్పుడు చేరాడో అప్పుడే సచ్చిపోయిండు. చంపిన పామును చంపాల్సిన అవసరం మాకు లేదు. ఇక వరంగల్ ఈస్ట్ విషయానికొస్తే.. మా హయాంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం’ అని సురేఖ చెప్పుకొచ్చారు. మరోవైపు రేవంత్ ప్రసంగిస్తూ.. వైఎస్ హయాంలో ఎంత గుర్తింపు ఉందో.. రాబోయే ప్రభుత్వంలోనూ కొండా దంపతులకు అదే గుర్తింపు ఉంటుందని, ఇక్కడ సురేఖ గెలుపుతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వరంగల్ ఇన్చార్జ్ అంజనీకుమార్ యాదవ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కొండా సుస్మితా పటేల్, నమిండ్ల శ్రీనివాస్, ఎర్రబెల్లి స్వర్ణ, రవళిరెడ్డి, బట్టి శ్రీనివాస్, సుధాకర్‌గౌడ్, అయూబ్‌ఖాన్, మీసాల ప్రకాశ్, కూరతోట సదానందం, మడిపెల్లి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రాకతో జోష్.. హాథ్ సే హాథ్ జోడో యాత్ర వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జోష్ నింపింది. నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో రేవంత్‌రెడ్డితో కలిసి ముందుకు సాగారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. స్థానిక నేతల పాలన తీరును విమర్శిస్తూ.. చురకలు అంటిస్తూ చేసిన ప్రసంగం కార్యకర్తలను ఉత్సాహపరిచేలా చేసింది. మంగళవారం సాయంత్రం 6.28 గంటలకు ఎంజీఎం చౌరస్తాకు చేరుకున్న రేవంత్‌రెడ్డి.. రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నాయకులతో కలిసి పాదయాత్రను ప్రారంభించారు. చదవండి: భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. యువజన నేతపై దాడితో ఉద్రిక్తతలు -
ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా: ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి, న్యూస్‌లైన్: ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా.. కానీ అవకాశం రాలేదని, పాలకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా... ఇక్కడి ప్రజల ఆశీస్సులతో గెలుస్తానని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలో పలు గ్రామాల్లో టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్య ర్థులను గెలిపించాలని మంగళవారం ఆయన ప్రచా రం నిర్వహించారు. తాను వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున పలు ప్రాంతాల నుంచి పోటీ చేయమని కోరుతున్నారని, అయినా పాలకుర్తి నుంచే పోటీ చేస్తున్నానని అన్నారు. -
టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి: శంకరమ్మ
అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: పాలకుర్తి అసెంబ్లీ నుండి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి చేసుకుంటానని అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలోనే శంకరమ్మ బుధవారం కలిశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి శాసనసభ స్థానం నుండి పార్టీ టికెట్‌ను ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పాలకుర్తి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ టికెట్‌ను ఇస్తానని కేసీఆర్ హామీనిచ్చారు. ఎమ్మెల్యే టికెట్నే ఇవ్వాలని, ఎమ్మెల్సీ వద్దని శంకరమ్మ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ టికెట్‌ను ఇవ్వకుంటే శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్న ఎల్బీ నగర్ చౌరస్తాలోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్నారు. 3 రోజుల సమయం ఇవ్వాలని, ఆలోచించి చెబుతానని కేసీఆర్ కోరినట్టుగా శంకరమ్మ విలేకరులకు వివరించారు.