కీసర:పేద రెడ్డి కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఆదివారం కీసరగుట్టలో నిర్వహించిన కుషాయిగూడ రెడ్డి సంక్షేమ సం ఘం 5వ వార్షికోత్సవం, 2018 క్యాలెం డర్ ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంక్షేమ సంఘాలన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి రెడ్డి కులస్థుల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు.
పేద రెడ్డి పిల్లల ఉన్నత చదువుల కోసం ఇతర కులస్తులకు ఇస్తున్నట్లుగానే రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ సముఖంగా ఉన్నారన్నారు. రెడ్డి సంక్షేమ సంఘాలను బలోపేతం చేసుకొని సామా జిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహి ంచాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, కుషాయిగూడ రెడ్డి సంక్షేమం అధ్యక్షుడు చిటుకుల నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి నరేందర్‌రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నేతలు ఎల్లారెడ్డి, వసంతరెడ్డి, సంతోష్‌రెడ్డి, రాజిరెడ్డి, రాంరెడ్డి, వల్లారెడ్డి, కందాడి హనుమంత్‌రెడ్డి, శివరాంరెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, బలవంత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment