calender release
-
పొన్నియిన్ సెల్వన్ క్యాలెండర్ ఆవిష్కరణ
తమిళసినిమా: 2022లో అనూహ్య విజయం సాధింన చిత్రం పొన్నియిన్ సెల్వన్. దర్శకుడు మణిరత్నం అద్భుత సృష్టి ఇది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్ కుమార్, ప్రకాశ్‌రాజ్, విక్రమ్‌ప్రభు వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ నాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. కల్కి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్ర రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. దర్శకుడు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని వ్యవస్థాపకురాలుగా నామ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. దీనికి దర్శకుడు కూడా గౌరవ ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది స్వచ్ఛంద సేవ ఫౌండేషన్. దీని ద్వారా పలుసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా నామ్– 2023 పేరుతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం దృశ్యాలతో క్యాలెండర్‌ను పొందుపరిచారు. బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. మణిరత్నం, సుహాసినితో పాటు నామ్ ఫౌండేషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జయంరవి, జయరాం, రఘు పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. -
జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
-
క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ ఉద్యోగులు, కార్మిక సంఘాల డైరీలు, క్యాలెండర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ 2021 క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్ జగన్ -
‘మై సౌత్‌దివా’ ఆవిష్కరణలో శ్రియ సందడి
సినీనటి శ్రియా హొయలొలికించింది. కేలండర్ ఆవిష్కరణలో సందడి చేసింది. భారతి సిమెంట్స్ సహకారంతో ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ‘మై సౌత్‌దివా– 2020’ కేలండర్‌ను మోడల్స్‌తో కలిసి గురువారం ఆమె ఆవిష్కరించింది. రామానాయుడు స్టూడియో ఇందుకు వేదికైంది. జూబ్లీహిల్స్: సుందరాంగుల అందాలని కెమెరాలో అద్భుతంగా ఒడిసిపడుతూ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ ఆధ్వర్యంలో భారతి సిమెంట్స్ సహకారంతో రూపొందించిన ‘మై సౌత్‌దివా కేలండర్ 2020’ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించారు. నటి శ్రియాశరణ్, భారతి సిమెంట్స్ డైరెక్టర్ (మార్కెటింగ్) రవీందర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొని కేలండర్‌ను ఆవిష్కరించారు. ఫొటోగ్రాఫర్ మనోజ్ మాట్లాడుతూ... హైదరాబాద్ సహా శ్రీలంక, ఊటి, ఖట్మాండు, ముంబైలలో ఫొటోషూట్ చేసినట్లు తెలిపారు. -
ఎక్సైజ్ సమస్యల్ని పరిష్కరిస్తా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఉద్యోగుల ప్రతీ సమస్యను పరిష్కరిస్తానని ఆశాఖ మంత్రి టి. పద్మారావు అన్నారు. సొంత భవనాలు, రవాణా సౌకర్యాల కల్పన వంటి సమస్యలను ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన ఆ శాఖ డైరీ, క్యాలెండర్–2018 ఆవి ష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ..ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంక్రాంతి తరువాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చడంలో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవి ప్రసాద్ రావు, ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పేద రెడ్డి కుటుంబాలను ఆదుకుంటాం
కీసర:పేద రెడ్డి కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఆదివారం కీసరగుట్టలో నిర్వహించిన కుషాయిగూడ రెడ్డి సంక్షేమ సం ఘం 5వ వార్షికోత్సవం, 2018 క్యాలెం డర్ ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంక్షేమ సంఘాలన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి రెడ్డి కులస్థుల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పేద రెడ్డి పిల్లల ఉన్నత చదువుల కోసం ఇతర కులస్తులకు ఇస్తున్నట్లుగానే రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ సముఖంగా ఉన్నారన్నారు. రెడ్డి సంక్షేమ సంఘాలను బలోపేతం చేసుకొని సామా జిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహి ంచాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, కుషాయిగూడ రెడ్డి సంక్షేమం అధ్యక్షుడు చిటుకుల నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి నరేందర్‌రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నేతలు ఎల్లారెడ్డి, వసంతరెడ్డి, సంతోష్‌రెడ్డి, రాజిరెడ్డి, రాంరెడ్డి, వల్లారెడ్డి, కందాడి హనుమంత్‌రెడ్డి, శివరాంరెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, బలవంత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు. -
కురుబలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : కురుబలకు ప్రత్యేక ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కురుబ సంఘం అడ్‌హక్ కమిటీ అధ్యక్షుడు, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో శనివారం నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కురుబ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాష్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి గూడూరు మనోహర్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కురుబలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారన్నారు. ఫెడరేషన్, ప్రత్యేక పాలకమండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కురుబ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వశికేరి లింగమూర్తి, పోతప్ప, లోక్‌నాథ్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బ్యాళ్ల నాగేంద్ర. కురుబ యువత నాయకులు వశికేరి రమేష్, బండి పరుశురాం బండి శ్రీకాంత్, ఆది, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.