
సినీనటి శ్రియా హొయలొలికించింది. కేలండర్ ఆవిష్కరణలో సందడి చేసింది. భారతి సిమెంట్స్ సహకారంతో ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ‘మై సౌత్‌దివా– 2020’ కేలండర్‌ను మోడల్స్‌తో కలిసి గురువారం ఆమె ఆవిష్కరించింది. రామానాయుడు స్టూడియో ఇందుకు వేదికైంది.
జూబ్లీహిల్స్: సుందరాంగుల అందాలని కెమెరాలో అద్భుతంగా ఒడిసిపడుతూ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ ఆధ్వర్యంలో భారతి సిమెంట్స్ సహకారంతో రూపొందించిన ‘మై సౌత్‌దివా కేలండర్ 2020’ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించారు. నటి శ్రియాశరణ్, భారతి సిమెంట్స్ డైరెక్టర్ (మార్కెటింగ్) రవీందర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొని కేలండర్‌ను ఆవిష్కరించారు. ఫొటోగ్రాఫర్ మనోజ్ మాట్లాడుతూ... హైదరాబాద్ సహా శ్రీలంక, ఊటి, ఖట్మాండు, ముంబైలలో ఫొటోషూట్ చేసినట్లు తెలిపారు.