పొన్నియిన్‌ సెల్వన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ | Suhasini Mani Ratnam Launched Ponniyin Selvan Naam Foundation Calendar | Sakshi
Sakshi News home page

Ponniyin Selvan: పొన్నియిన్‌ సెల్వన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

Published Fri, Jan 6 2023 10:30 AM | Last Updated on Fri, Jan 6 2023 10:32 AM

Suhasini Mani Ratnam Launched Ponniyin Selvan Naam Foundation Calendar - Sakshi

తమిళసినిమా: 2022లో అనూహ్య విజయం సాధింన చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. దర్శకుడు మణిరత్నం అద్భుత సృష్టి ఇది. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్‌ కుమార్, ప్రకాశ్‌రాజ్, విక్రమ్‌ప్రభు వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రానికి ఆస్కార్‌ నాయకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. కల్కి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్ర రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

కాగా పొన్నియిన్‌ సెల్వన్‌– 2 చిత్రం ఏప్రిల్‌ 28న తెరపైకి రానుంది. దర్శకుడు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని వ్యవస్థాపకురాలుగా నామ్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్నారు. దీనికి దర్శకుడు కూడా గౌరవ ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది స్వచ్ఛంద సేవ ఫౌండేషన్‌. దీని ద్వారా పలుసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా నామ్‌– 2023 పేరుతో పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం దృశ్యాలతో క్యాలెండర్‌ను పొందుపరిచారు. బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. మణిరత్నం, సుహాసినితో పాటు నామ్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జయంరవి, జయరాం, రఘు పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement