
నాలుగుపదుల వయస్సులోనూ త్రిషకు అవకాశాలు వెల్లవెత్తుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ముందు అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ చైన్నె సుందరికి మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో బిగ్ బ్రేక్ ఇచ్చారు. దీనిని రెండు భాగాలుగా త్రిష అందాలను మెరుగుపరచడమే కాకుండా అమెలోని అద్భుతమైన అభినయాన్ని బయటకు తీశారు.
(ఇదీ చదవండి: 'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం')
ఆ చిత్రంలోని ఘటనకు ప్రశంసల వర్షం కురిపించుకున్న త్రిష ఆ తరువాత అవకాశాల జోరులో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం విజయ్ సరసన లియో చిత్రంలో నటించిన ఈ బ్యూటీ తదుపరి అజిత్ కథానాయకుడిగా నటించనున్న విడాముయిర్చి చిత్రంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సుదీర్ఘ విరామం తరువాత తెలుగులో చిరంజీవితో జతకట్టే అవకాశం వరించింది. మరికొన్ని నూతన అవకాశాలు ఈ అమ్మడి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థితుల్లో త్రిషకు దర్శకుడు మణిరత్నం నుంచి మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మెద్రాస్ టాకీస్ పతాకంపై చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన నిర్మించే చిత్రంలో త్రిషను కథానాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment