ఎక్సైజ్‌ సమస్యల్ని పరిష్కరిస్తా | Calendar innovation by minister padamarao | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ సమస్యల్ని పరిష్కరిస్తా

Published Sat, Jan 13 2018 2:19 AM | Last Updated on Sat, Jan 13 2018 2:19 AM

Calendar innovation by minister padamarao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఉద్యోగుల ప్రతీ సమస్యను పరిష్కరిస్తానని ఆశాఖ మంత్రి టి. పద్మారావు అన్నారు. సొంత భవనాలు, రవాణా సౌకర్యాల కల్పన వంటి సమస్యలను ఇప్పటికే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

సచివాలయంలో శుక్రవారం జరిగిన ఆ శాఖ డైరీ, క్యాలెండర్‌–2018 ఆవి ష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ..ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంక్రాంతి తరువాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చడంలో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌బీసీఎల్‌ చైర్మన్‌ దేవి ప్రసాద్‌ రావు, ముఖ్యకార్యదర్శి సోమేశ్‌ కుమార్, అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement