కురుబలకు ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలి | kuruba sangham calender release | Sakshi
Sakshi News home page

కురుబలకు ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలి

Published Sat, Jan 21 2017 10:23 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

కురుబలకు ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలి

కురుబలకు ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలి

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : కురుబలకు ప్రత్యేక ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కురుబ సంఘం అడ్‌హక్‌ కమిటీ అధ్యక్షుడు, రిటైర్డ్‌ జడ్జి కిష్టప్ప కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో  ఆ సంఘం ఆధ్వర్యంలో శనివారం నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు.  కురుబ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాష్‌బాబు  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  కార్యక్రమానికి గూడూరు మనోహర్‌ అధ్యక్షత వహించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కురుబలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారన్నారు.   ఫెడరేషన్‌,  ప్రత్యేక పాలకమండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదన్నారు.   ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.   కురుబ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వశికేరి లింగమూర్తి, పోతప్ప, లోక్‌నాథ్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బ్యాళ్ల నాగేంద్ర. కురుబ యువత నాయకులు వశికేరి రమేష్, బండి పరుశురాం బండి శ్రీకాంత్, ఆది, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement