kuruba sangham
-
కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా బోరంపల్లి
అనంతపురం రూరల్ : అఖిల భారత కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా తనను నియమించినట్లు బోరంపల్లి ఆంజనేయులు తెలిపారు. ఈమేరకు జాతీయ అధ్యక్షుడు సతాన్‌సింగ్‌పాల్ నుంచి గురువారం నియామక ఉత్తర్వులు అందాయన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 10 కోట్లకు మందికి పైగా కురుబలు ఉన్నారని, కురుబల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
కురుబలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : కురుబలకు ప్రత్యేక ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కురుబ సంఘం అడ్‌హక్ కమిటీ అధ్యక్షుడు, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో శనివారం నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కురుబ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాష్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి గూడూరు మనోహర్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కురుబలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారన్నారు. ఫెడరేషన్, ప్రత్యేక పాలకమండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కురుబ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వశికేరి లింగమూర్తి, పోతప్ప, లోక్‌నాథ్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బ్యాళ్ల నాగేంద్ర. కురుబ యువత నాయకులు వశికేరి రమేష్, బండి పరుశురాం బండి శ్రీకాంత్, ఆది, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
కురుబ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా సుధాకర్
అనంతపురం న్యూటౌన్ : జిల్లా కురుబ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన కురుబ సుధాకర్‌ను ఎంపిక చేశారు. మంగళవారం సాయంత్రం కనకదాస కల్యాణమండపంలో జరిగిన సమావేశంలో కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు రాగే పరుశురామ్ ఈ మేరకు సుధాకర్‌కు నియామకపత్రాలనందించారు. సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటశివ, మంజునాథ్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షడు శంకరనారాయణ పరిగి(పెనుకొండ రూరల్) : ఆర్థికంగా వెనుకబడిన కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని భీరలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కురుబ కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుబలను ఎస్టీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ ...ఆ తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే పార్థసారథి కూడా కురుబలను పూర్తిగా విస్మరించారన్నారు. కురుబలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే విద్యతోనే అది సాధ్యమని, అందువల్ల కురుబలంతా తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను చదివిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లేనన్నారు. కురుబలు కర్ణాటకలో ఎస్టీ జాబితాలో ఉన్నారనీ, రాష్ట్రంలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చేలా సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నాయకులు వెంకటరమణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
'కురుబలను ఎస్టీలో చేర్చాలి'
అనంతపురం: కనకదాస జయంతి సందర్భంగా ఆదివారం అనంతపురం టవర్ క్లాక్ నుంచి పాత ఊరు వరకు కుర్బాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కల్యాణ దుర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయ కర్త ఉషా, మాజీ మేయర్ రాజే పరశురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుర్బలను ఎస్టీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెబుతామని ఆ సంఘం నేతలు హెచ్చరించారు. -
కళాకారులకు సన్మానం
విజయనగరం కల్చరల్: స్థానిక లలిత కళా పరిషత్ భవనంలో జరిగిన కార్యక్రమంలో 150 మంది కళాకారులను సన్మానించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కురుబ సంఘం నేతలు పరశురాం, శంకరనారాయణతోపాటు ఎమ్మెల్యే పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.