కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం టవర్ క్లాక్ నుంచి కుర్బాలు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం: కనకదాస జయంతి సందర్భంగా ఆదివారం అనంతపురం టవర్ క్లాక్ నుంచి పాత ఊరు వరకు కుర్బాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కల్యాణ దుర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయ కర్త ఉషా, మాజీ మేయర్ రాజే పరశురాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుర్బలను ఎస్టీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెబుతామని ఆ సంఘం నేతలు హెచ్చరించారు.