పేద రెడ్డి విద్యార్థులకు ఉచిత విద్య
పేద రెడ్డి విద్యార్థులకు ఉచిత విద్య
Published Sun, May 28 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
– ‘పది’ టాపర్ల అభినందన సభలో విద్యాసంస్థల అధినేతలు
కర్నూలు (అర్బన్): జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు తమ సహకారం అందజేస్తామని నగరంలోని పలు విద్యా సంస్థల అధినేతలు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం స్థానిక హర్ష రిజెన్సీలోని సమావేశ భవనంలో రెడ్ల యువజన సంక్షేమ సంఘం, రెడ్ల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల్లో 9.5 నుంచి 10కి 10 పాయింట్లు సాధించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల అభినందన సభ జరిగింది. కార్యక్రమానికి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు కశిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కేవీఎస్‌ఆర్ విద్యాసంస్థల అధినేత డా.కేవీ సుబ్బారెడ్డి, నారాయణ విద్యాసంస్థల సీఈఓ లింగేశ్వరరెడ్డి, ప్రతిభ స్కూల్ అధినేత అరుణాచలరెడ్డి, ఎన్‌ఎంఆర్ కళాశాల అధినేత మల్లికార్జునరెడ్డి, సాయియుక్త కళాశాల అధినేత భోగేంద్రనాథ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆర్థికస్థోమత లేక పది తరువాత చదువును ఆపేస్తున్నారని, అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. జీ పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం 122 మంది విద్యార్థులను సన్మానించారు. రెడ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులకుర్తి నరసింహారెడ్డి, యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొనపాటి యల్లారెడ్డి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు బిర్రు ప్రతాపరెడ్డి, శివసేన జిల్లా అధ్యక్షుడు తూముకుంట ప్రతాపరెడ్డి, నాయకులు మనోహర్‌రెడ్డి, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement