సాక్షి, హైదరాబాద్: రెడ్డి కులస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్న డిమాండ్‌తో మే 27న 10 లక్షల మంది రెడ్లతో సమరభేరి నిర్వహించనున్నట్లు రెడ్డి జేఏసీ చైర్మన్ నవల్గ సత్యనారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో గౌరెల్లి, ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్–10 వద్ద ఈ సభ నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం 500 మంది రెడ్లతో బహిరంగ సభ నిర్వహించే స్థలంలో భూమిపూజ చేశారు.
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, రెడ్ల కోసం ప్రత్యేక గురుకులాలు, స్టడీ సర్కిళ్లు, పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు సంక్షేమం, ఆరోగ్య పథకాల సమాన వర్తింపు, స్వయం ఉపాధి, సహకార రంగాల్లో ప్రభుత్వ చేయూత తదితర పది ప్రధాన డిమాండ్ల సాధన కోసం సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మద్దతు ప్రకటించారు.
మే 27న రెడ్ల సమరభేరి
Published Tue, Apr 10 2018 2:26 AM | Last Updated on Tue, Apr 10 2018 2:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment