టీడీపీ నేత శివానందరెడ్డిని ప్రశ్నించిన పోలీసులు!
బుద్వేల్ అసైన్డ్ భూముల కేసులో ఈయన నిందితుడు
బుధవారం సీసీఎస్‌లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరు
దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై ఆరా
వచ్చే వారం మరోసారి రావాలంటూ ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల అసైన్డ్ భూమిని కాజేసిన వ్యవహారంలో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి బుధవారం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల ఎదుట హాజరయ్యారు. అధికారులు శివానందరెడ్డిని దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఆయన నుంచి కొంత సమాచారం సేకరించిన పోలీసులు వచ్చే వారం మరోసారి సీసీఎస్‌లో హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివానందరెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్‌్క, ప్రశాంత్‌రెడ్డినీ సీసీఎస్ పోలీసులు గత వారం ప్రశ్నించిన విషయం విదితమే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని తొలుత ప్రయత్నించిన రియల్టర్లు టీజే ప్రకా‹Ù, గాం«దీ, రామారావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ 2021లో మిమ్మల్ని ఎందుకు సంప్రదించారంటూ పోలీసులు శివానందరెడ్డిని ప్రశ్నించారు.
బుద్వేల్‌లోని ఆ భూమికి సంబంధించిన పూర్వాపరాలు తెలిసినప్పటికీ పోలీసు అధికారిగా ఉన్న పరిచయాలు, పలుకుబడి వినియోగించి అసైన్డ్ ల్యాండ్‌ను కాజేయాలని ప్రయత్నించడంపై శివానందరెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ భూములు సొంతం చేసుకునే ఉద్దేశంతో 2021–22 మధ్య కాలంలో అసైనీలకు శివానందరెడ్డి తన సంస్థ ద్వారా చెక్కుల రూపంలో చెల్లించిన మొత్తం వివరాలను సీసీఎస్ పోలీసులు అడిగారు.
ఇంకా మీ వెనుక ఎవరున్నారు?
ఆ అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం 2022–23 మధ్య ఎవరెవరి ద్వారా? ఎక్కడెక్కడ లాబీయింగ్ చేశారు? ఈ వ్యవహారంలో ఎవరు కీలకంగా వ్యవహరించారు? అనే వివరాలను శివానందరెడ్డి నుంచి రాబట్టడానికి సీసీఎస్ పోలీసులు ప్రయత్నించారు. అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు మె మో జారీ అవడం వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశా న్నీ పోలీసులు ప్రశ్నించారు.
గత ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ జరగ్గా.. ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్‌ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీస్‌లకు వారిపై రిజిస్టర్ చే యడం పైనా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు.
అసైనీలను భయపెట్టి ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములు లాక్కోవడానికి కుట్ర ప న్న డం ఉద్దేశపూర్వకంగా చేసిందా? అనే అంశాన్నీ పోలీ సు లు పరిగణనలోకి తీసుకుని శివానందరెడ్డిని ప్రశ్నించా రు. ఆయన నుంచి సేకరించిన సమాచారాన్ని సరిచూడాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం మరోసారి రావాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment