అందాల పోటీల గురించి ఉండే సంప్రదాయ ఆలోచనలను బ్రేక్ చేసింది మిసెస్ ఇండియా ఎంప్రెస్ ఆఫ్ ది నేషన్. పుణెలో జరిగిన ఈ అందాల పొటీలలో డెబ్బై సంవత్సరాల బామ్మలు కూడా పాల్గొన్నారు. ఎంతో ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు....
‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేది ‘మిసెస్ ఇండియా ఎంప్రెస్ ఆఫ్ ది నేషన్–2023 (సీజన్4) నినాదం. సిల్వర్, గోల్డ్, ఎలిట్ విభాగాలలో 21 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న మహిళలు పాల్గొన్నారు. ర్యాంప్‌పై నడిచి ప్రేక్షకులను హుషారెత్తించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో ΄ాటు సినీనటులు, గత ΄ోటీల విజేతలు కూడా ΄ాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రతి విభాగంలో ‘టాప్ 3’ని ఎంపిక చేశారు.
సిల్వర్ కేటగిరి (21 నుంచి 38 సంవత్సరాలు) లో పుణెకు చెందిన ప్రియాంక గడియ, ఆ తరువాత స్థానంలో దిల్లీకి చెందిన అభిలాష చహలియ, గోవాకు చెందిన డా. నేహా ప్రభు సల్గావ్‌కర్ నిలిచారు. గోల్డ్ కేటగిరి (39 నుంచి 49 సంవత్సరాలు)లో భో΄ాల్‌కు చెందిన అపేక్ష దబ్రాల్, ఆ తరువాత స్థానంలో పుణెకు చెందిన డా. మృణాళిని భరద్వాజ్, ముంబైకి చెందిన రక్షా కర్వ నిలిచారు. ఎలిట్ కేటగిరీ (50 సంవత్సరాల పైన) బెంగళూరుకు చెందిన సుజాత శర్మ, ఆ తరువాత స్థానంలో దిల్లీకి చెందిన సీమా సిన్హా, కోల్‌కత్తాకు చెందిన కకోలి ఘోష్ నిలిచారు.
సిల్వర్ కేటగిరీ విజేతలలో ఒకరైన అభిలాష చహలియ వృత్తిరీత్యా న్యాయవాది.‘వివాహం తరువాత మనలోని కలలను పక్కన పెట్టడం సరికాదు’ అంటుంది.
అభిలాషకు చిన్నప్పటి నుంచి లైట్లు, కెమెరాలతో కూడిన గ్లామర్ ఇండస్ట్రీ అంటే ఇష్టం. అయితే చదువు, కెరీర్, పెళ్లి వల్ల తనకు ఇష్టమైన రంగానికి దూరం కావాల్సి వచ్చింది. గ్లామర్ ఇండస్ట్రీపై తన ఇష్టం, కలలు మాత్రం చెక్కుచెదరలేదు. 37 సంవత్సరాల వయసులో ‘మిసెస్ ఇండియా ఎంప్రెస్ ఆఫ్ ది నేషన్’లో ΄ాల్గొనడం, ర్యాంప్ వాక్ చేయడం తనకు చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది.
‘ఆలస్యం అయితేనేం! చిన్నప్పటి కలను నెరవేర్చుకున్నాను’ అనే సంతోషం అభిలాష మాటల్లో కనిపిస్తుంది.
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అభిలాష...‘చిన్నప్పటి కల నెరవేరడం కంటే గొప్ప సంతోషం ఏముంటుంది. కన్న కలను గుండెలో సజీవంగా ఉంచుకోగలిగితే అది నెరవేరడం అసాధ్యం కాదు. కుటుంబసభ్యులు నాకు ్ర΄ోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించారు. ఏమనుకుంటారో అనే సందేహం వదిలేయండి. మనసులో ఉన్న మాట నిస్సంకోచంగా బయటపెట్టండి చాలు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం మనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’ అంటుంది
అభిలాష.
‘పదిమందిలో గుర్తింపు అనేది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం అందాన్నిస్తుంది’ అంటుంది ఎలిట్ కేటగిరి విజేతలలో ఒకరైన కోల్‌కత్తాకు చెందిన కకోలీ ఘోష్.
‘మనకు ఉండే బరువు బాధ్యతల వల్ల మనసులోని కలలను సాకారం చేసుకోవడం అసాధ్యమేమో అనిపిస్తుంది. కానీ ఇది నిజం కాదు. సాధించాలి అని గట్టిగా అనుకుంటే అసాధ్యమైనది లేదు. నా కలను సాకారం చేసుకున్నాను అనే సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’ అంటుంది గోల్డ్ కేటగిరిలో విజేత అయిన భో΄ాల్‌కు చెందిన అపేక్ష దబ్రాల్.
‘విజేతల కళ్లలో కనిపించిన సంతోషం, ఆత్మవిశ్వాసం వారికి మాత్రమే పరిమితం కావు. ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చి తమ కలను సాకారం చేసుకోవడానికి ముందుకు నడిపిస్తాయి’ అంటుంది ఈ కార్యక్రమ అతిథుల్లో ఒకరైన నటి నీలమ్ కొఠారి.
Comments
Please login to add a commentAdd a comment