
కాన్సాస్: అమెరికా లోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హై స్కూలులో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది తెలుగువారు పాల్గొన్నారు. ప్రార్థనా గీతంతో కార్యక్రమానికి విశేషు రేపల్లె, శ్రావణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
మన తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే కూచిపూడి, భరత నాట్యంతో పాటు జానపద నృత్యాలు అలరించాయి. కొత్త సినిమా పాటలకు చిన్నారుల నృత్యాలు, అభిగ్న పాటలు ప్రేక్షకులను ఉత్సాహపర్చాయి. టీఏజీకేసీకి సేవలు అందించిన శ్రీధర్ కొడాలి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శరత్ టేకులపల్లి, శ్రీధర్ అమిరెడ్డిలను టీఏజీకేసీ ఈ వేడుకలో ఘనంగా సత్కరించింది. టీఏజీకేసీ అధ్యక్షుడు వంశీ సువ్వారి, Trust chair దుర్గా తెల్ల గార్లను మెమొంటొలతో సత్కరించారు. Rafflesలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
30 మందితో నిర్వహించిన ఫ్యాషన్ షో, ‘కాన్సాస్ కిష్కింద కాండ’ హాస్య నాటిక హైలైట్‌గా నిలిచాయి. టీఏజీకేసీకి ఉపాధ్యక్షులు నరేంద్ర దుదెళ్ళ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా చక్కని తెలుగు విందు భోజనాన్ని ఆరగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్పార్సర్స్‌తో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ బోర్డు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment