న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సేవల కంపెనీ నారాయణ హృదయాలయ బెంగళూరులోని ఆర్థోపెడిక్ ఆసుపత్రిని కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. వ్యాపార బదిలీకి వీలుగా శివ అండ్ శివ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తద్వారా స్లంప్ సేల్ పద్ధతిలో ఆర్థోపెడిక్ ట్రౌమా ఆసుపత్రిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది.
ఆసుపత్రికి సంబంధించిన అన్నిరకాల ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, లైసెన్సులు, కాంట్రాక్టులు బదిలీకానున్నట్లు వివరించింది. స్పార్‡్ష గ్రూప్ హాస్పిటల్స్‌కు చెందిన సంస్థ 100 పడకల సామర్థ్యంతో దశాబ్దకాలానికిపైగా ఆర్థోపెడిక్ సర్వీసులను అందిస్తోంది. గతేడాది ఈ యూనిట్ రూ. 49 కోట్ల ఆదాయాన్ని సాధించింది.
ఈ వార్తల నేపథ్యంలో నారాయణ హృదయాలయ షేరు బీఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 707 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment