Narayana hrudayalaya
-
నారాయణ హృదయాలయ విస్తరణ
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సేవల కంపెనీ నారాయణ హృదయాలయ బెంగళూరులోని ఆర్థోపెడిక్ ఆసుపత్రిని కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. వ్యాపార బదిలీకి వీలుగా శివ అండ్ శివ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తద్వారా స్లంప్ సేల్ పద్ధతిలో ఆర్థోపెడిక్ ట్రౌమా ఆసుపత్రిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఆసుపత్రికి సంబంధించిన అన్నిరకాల ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, లైసెన్సులు, కాంట్రాక్టులు బదిలీకానున్నట్లు వివరించింది. స్పార్‡్ష గ్రూప్ హాస్పిటల్స్‌కు చెందిన సంస్థ 100 పడకల సామర్థ్యంతో దశాబ్దకాలానికిపైగా ఆర్థోపెడిక్ సర్వీసులను అందిస్తోంది. గతేడాది ఈ యూనిట్ రూ. 49 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ వార్తల నేపథ్యంలో నారాయణ హృదయాలయ షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 707 వద్ద ముగిసింది. -
అర్ధరాత్రి నారాయణ హృదయాలయలో ఉద్రిక్తత
-
టెక్కీని కాపాడింది కానీ జయను...
బెంగళూరు : కార్డియాక్ అరెస్టుకు గురై అసువులు బాసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చివరి ఘడియల్లో అందించిన ఎక్మో చికిత్స, ఓ టెక్కీ ప్రాణాలను కాపాడగలిగింది. అకస్మాత్తుగా తీవ్ర జ్వరంతో ఐసీయూ చేరిన 43 ఏళ్ల శ్రీనాథ్‌కు ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి ఇలా అయ్యే సరికి కుటుంబసభ్యులకు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ వెంటనే స్పందించిన డాక్టర్లు, ఇటీవలే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన ఎక్మో చికిత్సను టెక్కీకి అందించారు. దీంతో శ్రీనాథ్ గుండెను 24 గంటల లోపల తిరిగి మామూలు స్థాయికి చేరుకునేలా చేశారు. జయలలితకు, ఇప్పుడు శ్రీనాథ్‌కు అందించిన ఎక్మో చికిత్సలో ఓ యంత్ర పరికరం ద్వారా రక్తాన్ని పేమెంట్ శరీరంలోకి ప్రవహించేలా చేశారు. కార్బన్‌డయాక్సైడ్‌ను బయటికి తీస్తూ... ఆక్సిజన్‌ను ఎర్ర రక్తకణాల్లోకి పంపిస్తూ గుండెను మామూలు స్థితికి చేరుకునేలా కృషిచేశారు. కానీ ఈ చికిత్సలో టెక్కీ తిరిగి మామూలు స్థాయికి చేరుకోగా, జయలలిత ఆరోగ్య పరిస్థితి ఆ చికిత్సకు సపోర్టు చేయక ఆమె ప్రాణాలు వదిలారు. భారత్‌లో ఈ చికిత్సపై అవగాహన తక్కువ. చాలామంది పేషెంట్లు గుండె కొట్టుకోవడం ఆగిపోయి మరణిస్తున్నప్పటికీ, వారికి ఈ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉండటం లేదు. విషమ పరిస్థితికి చేరుకున్న గుండెను సైతం ఈ చికిత్స ద్వారా సాధారణ పరిస్థితికి తీసుకురావచ్చు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు హార్ట్ అటాక్‌కు గురైనప్పుడూ ఈ చికిత్స ఎంతో ఉపయోగపడుతోంది. ఈ చికిత్స గురించి దేశంలో అవగాహన కల్పించాల్సినవసరం ఉందని కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవీ శెట్టి చెప్పారు. శ్రీనాథ్‌తో పాటు 500 మందికి పైగా పేషెంట్లకు నారాయణ హృదయాలయ ఈ ఎక్మో చికిత్సను అందించింది. ఈ చికిత్సకు మొత్తం మూడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చవుతుంది. ఎక్మో చికిత్స ద్వారా తనకు పునర్జన్మ కలిగినట్టు శ్రీనాథ్ పేర్కొన్నారు. ఎక్మో చికిత్సను ఎప్పుడు ఎక్కువగా వాడతారు? ఎక్మో చికిత్సను ఎక్కువగా రెండు క్లిష్టమైన పరిస్థితుల్లో వాడతారు. ఒకటి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు(జయలలితకు జరిగిన మాదిరి), న్యూమోనియా లేదా గాయాలు వంటి ఇన్ఫెక్షన్ల వల్ల ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేనప్పుడు ఈ చికిత్సను అందిస్తారు. -
కరేబియన్ దీవుల్లో నారాయణ హృదయాలయ
గుండె శస్త్రచికిత్సలకు పేరొందిన నారాయణ హృదయాలయ.. ఇప్పుడు విదేశాల్లోకి కూడా అడుగు పెడుతోంది. కరేబియన్ దీవుల్లోని గ్రాండ్ కేమన్ దీవుల్లో కొత్త ఆస్పత్రి ఏర్పాటుచేస్తోంది. హెల్త్ సిటీ కేమన్ ఐలండ్స్ (హెచ్‌సీసీఐ) పేరుతో ఏర్పాటుచేస్తున్న ఈ ఆస్పత్రి వివరాలను నారాయణ హృదయాలయ చైర్మన దేవి శెట్టి, అమెరికాకు చెందిన అసెన్షియన్ హెల్త్ అలయెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆంటోనీ ఆర్ టెర్సింగిలతో కలిసి కేమన్ ప్రీమియర్ ఆల్డెన్ మెక్ లాఫ్లిన్ ఈ ఆస్పత్రి తొలిదశను ఆవిష్కరిస్తారు. రాబోయే 15 ఏళ్లలో దాదాపు రూ. 1.25 లక్షల కోట్లతో వివిధ దశల్లో ఈ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో ఏర్పాటుచేస్తారు. 200 ఎకరాల విస్తీర్ణంలో 104 పడకలతో ఇది రాబోతోంది. ఇక్కడ ఓపెన్ హార్ట్, బైపాస్ సర్జరీలు, ఆంజియోప్లాస్టీ, వాల్వ్ రీప్లేస్మెంట్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ లాంటి విభాగాల్లో వైద్యసేవలు అందుతాయి. పాశ్చాత్య దేశాల్లో కూడా తక్కువ ధరలకు మెరుగైన వైద్యాన్ని ఎలా అందించచ్చో ఈ ఆస్పత్రి ఉదాహరణగా చూపిస్తుందని అంటున్నారు.4 కోట్ల మంది జనాభా ఉన్న కేమన్ ఐలండ్స్ ఉత్తర అమెరికాకు చాలా వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఈ ఆస్పత్రిలో భారత్, బ్రిటన్, అమెరికాలకు చెందిన 140 మంది వైద్య సిబ్బంది ఉంటారు. నారాయణ హృదయాలయ గ్రూపునకు ఇప్పటికే మన దేశంలోని 14 నగరాల్లో 23 ఆస్పత్రులున్నాయి. ఇక బెంగళూరు శివార్లలోని హెల్త్ సిటీలో అయితే అతిపెద్ద మూలుగ మార్పిడి యూనిట్, డయాలసిస్ యూనిట్ ఉన్నాయి.