గుండె శస్త్రచికిత్సలకు పేరొందిన నారాయణ హృదయాలయ.. ఇప్పుడు విదేశాల్లోకి కూడా అడుగు పెడుతోంది. కరేబియన్ దీవుల్లోని గ్రాండ్ కేమన్ దీవుల్లో కొత్త ఆస్పత్రి ఏర్పాటుచేస్తోంది. హెల్త్ సిటీ కేమన్ ఐలండ్స్ (హెచ్సీసీఐ) పేరుతో ఏర్పాటుచేస్తున్న ఈ ఆస్పత్రి వివరాలను నారాయణ హృదయాలయ చైర్మన దేవి శెట్టి, అమెరికాకు చెందిన అసెన్షియన్ హెల్త్ అలయెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆంటోనీ ఆర్ టెర్సింగిలతో కలిసి కేమన్ ప్రీమియర్ ఆల్డెన్ మెక్ లాఫ్లిన్ ఈ ఆస్పత్రి తొలిదశను ఆవిష్కరిస్తారు. రాబోయే 15 ఏళ్లలో దాదాపు రూ. 1.25 లక్షల కోట్లతో వివిధ దశల్లో ఈ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో ఏర్పాటుచేస్తారు. 200 ఎకరాల విస్తీర్ణంలో 104 పడకలతో ఇది రాబోతోంది.
ఇక్కడ ఓపెన్ హార్ట్, బైపాస్ సర్జరీలు, ఆంజియోప్లాస్టీ, వాల్వ్ రీప్లేస్మెంట్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ లాంటి విభాగాల్లో వైద్యసేవలు అందుతాయి. పాశ్చాత్య దేశాల్లో కూడా తక్కువ ధరలకు మెరుగైన వైద్యాన్ని ఎలా అందించచ్చో ఈ ఆస్పత్రి ఉదాహరణగా చూపిస్తుందని అంటున్నారు.4 కోట్ల మంది జనాభా ఉన్న కేమన్ ఐలండ్స్ ఉత్తర అమెరికాకు చాలా వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఈ ఆస్పత్రిలో భారత్, బ్రిటన్, అమెరికాలకు చెందిన 140 మంది వైద్య సిబ్బంది ఉంటారు. నారాయణ హృదయాలయ గ్రూపునకు ఇప్పటికే మన దేశంలోని 14 నగరాల్లో 23 ఆస్పత్రులున్నాయి. ఇక బెంగళూరు శివార్లలోని హెల్త్ సిటీలో అయితే అతిపెద్ద మూలుగ మార్పిడి యూనిట్, డయాలసిస్ యూనిట్ ఉన్నాయి.
కరేబియన్ దీవుల్లో నారాయణ హృదయాలయ
Published Mon, Feb 24 2014 4:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
Advertisement
Advertisement