అమరజవాన్లకు నివాళులర్పిస్తూ సైకిల్‌యాత్ర | cycle tour | Sakshi
Sakshi News home page

అమరజవాన్లకు నివాళులర్పిస్తూ సైకిల్‌యాత్ర

Published Tue, Jan 17 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

అమరజవాన్లకు నివాళులర్పిస్తూ సైకిల్‌యాత్ర

అమరజవాన్లకు నివాళులర్పిస్తూ సైకిల్‌యాత్ర

గొల్లపూడి(మైలవరం): దేశం కోసం అసువులు బాసిన అమరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రిటైర్డు మేజర్‌ జనరల్‌ సోమనాథ్‌జా సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఆయన మంగళవారం గొల్లపూడి గ్రామం చేరుకున్నారు. గ్రామంలో ఆయనకు మాజీ సైనికులు సుబ్బారావు, నరిసింహారావు తదితరులు స్వాగతం  పలికి సత్కరించారు. సోమనా«థ్‌జా మాట్లాడుతూ  అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ హర్యానా రాష్ట్రం నుంచి సైకిల్‌యాత్ర చేస్తున్నానని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి మృతి చెందిన 21వేల మందికి సంతాపం తెలియజేయాలని అక్టోబర్‌ 19వ తేదీ నుంచి ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో  9వేల మంది అమరజవాన్లకు  సైకిల్‌యాత్రలో రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించినట్టు వివరించారు. ఏప్రిల్‌ నాటికి మిగిలిన వారికి శ్రద్ధాంజలి ఘటించి ఢిల్లీలోని అమరజ్యోతికి చేరుకోనున్నట్టు చెప్పారు. సోమనా«థ్‌జాతోపాటు ఆయన సతీమణి చిత్రజా కూడా యాత్రలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement