కలెక్టర్ ఆదేశాలు.. గొల్లపూడి టీడీపీ ఆఫీస్‌ను తొలగించిన అధికారులు.. | Police Remove Gollapudi Tdp Office After Collector Orders | Sakshi
Sakshi News home page

కలెక్టర్ ఆదేశాలు.. గొల్లపూడి టీడీపీ ఆఫీస్‌ను తొలగించిన అధికారులు..

Published Thu, Jan 19 2023 9:44 AM | Last Updated on Thu, Jan 19 2023 11:40 AM

Police Remove Gollapudi Tdp Office After Collector Orders - Sakshi

ఎన్టీఆర్ జిల్లా: గొల్లపూడి వన్ సెంటర్‌లో ప్రైవేట్ స్థలంలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

శేషారత్నం పేరిట ఉన్న ఈ స్థలంలో గత కొన్నాళ్లుగా టీడీపీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ స్థలాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో తన కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాలంటూ శేషారత్నం కలెక్టర్‌ను ఆశ్రయించారు. 

దీంతో గిఫ్ట్ డీడ్ రద్దు చేశారు కలెక్టర్. శేషారత్నానికి ఆ స్థలాన్ని స్వాధీనం చేసి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ నేతల ఆందోళనల నడుమ రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని కూల్చివేసి స్థలాన్ని శేషారత్నంకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement