కాలుష్య నివారణకు సైకిల్ యాత్ర
- ప్యాపిలికి చేరిన తమిళనాడు వాసి ఆండూ చార్లెస్
ప్యాపిలి : భూతాపాన్ని కాపాడండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ తమిళనాడుకు చెందిన ఆండూ చార్లెస్ చేపట్టిన సైకిల్ యాత్ర బుధవారం ప్యాపిలికి చేరుకుంది. ఉపాధ్యాయుడైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2005 జూన్ 6వ తేదీన సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సైకిల్ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 50 వేల కిలోమీటర్లు పర్యటించినట్లు ఆయన చెపాయ్పరు.అవివాహితుడైన తాను రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున సైకిల్‌పై ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. తన ఊపిరి ఉన్నంత వరకు ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.