‘తెలంగాణ’ కోసం సైకిల్‌యాత్ర
తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వీరప్ప మహరాజ్ చేపట్టిన సైకిల్‌యాత్ర బుధవారం పిట్లం మండల కేంద్రానికి చేరుకుంది. స్థానిక విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం తాత్సారాన్ని నిరసిస్తూ సైకిల్‌యాత్ర చేపట్టానని తెలిపారు. ఇప్పటికి మెదక్ జిల్లాలో 11 మండలాల్లో సైకిల్‌యాత్ర పూర్తి చే శానని, జిల్లాలో 11 మండలాల్లో యాత్ర చే పడతానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు సైకిల్‌యాత్ర చేపడతానని ఆయన పేర్కొన్నారు.
- పిట్లం, న్యూస్‌లైన్